Cashew Nuts : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల నట్స్‌లో జీడిపప్పు ఒకటి. దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. పెనంపై కాస్త వేయించిన జీడిపప్పును తినడం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. దీన్ని ఎక్కువగా మసాలా వంటకాలు.. తీపి వంటకాల్లో వేస్తుంటారు. అయితే జీడిపప్పును తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. కానీ వీటిని నేరుగా తినకూడదు. రాత్రి పూట గుప్పెడు జీడిపప్పును నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు వీటిని తినాలి. దీంతో అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
జీడిపప్పును నానబెట్టి తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. వీటిల్లో ఉండే పోషకాలు మనల్ని అనేక రకాల వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. జీడిపప్పులో పాలిఫినాల్స్, కెరోటినాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అయితే జీడిపప్పును నేరుగా తింటే కొందరికి జీర్ణం కాదు. అలాగే కొందరిలో ఇవి అలర్జీలను కలిగిస్తాయి. కనుక వీటిని నానబెట్టి తింటే సులభంగా జీర్ణమవుతాయి. దీంతో వాటిల్లో ఉండే పోషకాలన్నీ మనకు లభిస్తాయి. అలాగే అలర్జీలు ఉన్నవారిలో అలర్జీలు రాకుండా ఉంటాయి.
ఇక జీడిపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ పప్పులో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. అందువల్ల హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కనుక నానబెట్టిన జీడిపప్పును రోజూ తినాలి.
జీడిపప్పులో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. అందువల్ల జీడిపప్పును నేరుగా తింటే సరిగ్గా జీర్ణం కావు. కానీ నానబెట్టి తింటే ఫైటిక్ యాసిడ్ ప్రభావం తగ్గుతుంది. దీంతో జీడిపప్పు సులభంగా జీర్ణం అవుతుంది. ఫలితంగా అందులో ఉండే పోషకాలన్నీ మనకు లభిస్తాయి. ఇక జీడిపప్పు తినడం వల్ల కొందరికి అలర్జీలు వస్తాయి. అలాంటి వారు అలా జరగకుండా సురక్షితంగా ఈ పప్పును తినాలంటే.. ముందుగా వీటిని నీటిలో నానబెట్టాలి. తరువాత వీటిని తింటే ఎలాంటి అలర్జీలు రావు.
జీడిపప్పులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు. అలాగే ఈ పప్పులో ఉండే కాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా మారుస్తుంది. జీడిపప్పులో జింక్ కూడా ఎక్కువే. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు పురుషుల్లో వీర్యం అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. ఇక ఈ పప్పులో ఉండే మెగ్నిషియం, మాంగనీస్ ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను తగ్గిస్తాయి. మనస్సును ప్రశాంతంగా ఉండేలా చూస్తాయి. దీంతో హాయిగా అనిపిస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
అధిక బరువు తగ్గేందుకు కూడా జీడిపప్పు ఎంతగానో సహాయ పడుతుంది. వీటిల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కానీ ఈ పప్పును తినడం వల్ల లావు పెరగరు. పైగా ఆకలి నియంత్రణలో ఉంటుంది. కనుక ఇతర ఆహారాల జోలికి వెళ్లరు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. అలాగే ఈ పప్పును తింటే శరీర మెటబాలిజం పెరిగి క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఇలా జీడిపప్పు బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయ పడుతుంది.
ఈ పప్పును రోజూ నానబెట్టి తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. జీడిపప్పు మెదడుకు టానిక్‌లా పనిచేస్తుంది. అందువల్ల రోజూ వీటిని తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. యాక్టివ్‌గా ఉంటారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. చిన్నారులు చదువుల్లో రాణిస్తారు. తెలివిమంతులుగా మారుతారు.
జీడిపప్పు పురుషులకు ఎంతగానో మేలు చేస్తుంది. వీటిని రోజూ తినడం వల్ల పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ రాదు. అలాగే విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి కనుక శృంగార సామర్థ్యం పెరుగుతుంది. కనుక జీడిపప్పును ప్రతి ఒక్కరూ రోజూ తినాలి.