Pumpkin Seeds : గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను అస‌లు రోజూ ఎన్ని తినాలి.. ఎన్ని తింటే లాభాలు క‌లుగుతాయి..?

Pumpkin Seeds : గుమ్మ‌డి గింజ‌లు.. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఇవి కూడా ఒక‌టి. ఇవి చూడ‌డానికి చిన్న‌గా ఉన్న‌ప్ప‌టికి వీటిలో పోష‌కాలు మాత్రం కొండంత ఉంటాయి. ఈ గింజ‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శరీరానికి ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. గుమ్మ‌డి గింజ‌లు మ‌న శ‌రరానికి చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అం దిచ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ గుమ్మ‌డి గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అలాగే వీటిని ఎప్పుడు ఎలా తీసుకోవాలి..అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. గుమ్మ‌డి గింజ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. గుమ్మ‌డి గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీల‌ల్లో రొమ్ము క్యాన్స‌ర్, పురుషుల్లో ప్రోస్టేస్ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి.

అలాగే గుమ్మ‌డి గింజ‌ల్లో ఉండే మెగ్నీషియం రక్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో స‌హాయ‌పడుతుంది. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల రక్తంలో చ‌క్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. వీటిలో ఫాలీ అన్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. క‌నుక ఈ గింజ‌ల‌ను ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఈ గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి చెడుకొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. అంతేకాకుండా ఈ గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో వీర్య క‌ణాల నాణ్య‌త కూడా పెరుగుతుంది. గ‌ర్భిణీ స్త్రీలు రోజూ గుమ్మ‌డి గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు చ‌క్క‌గా అందుతాయి. అలాగే నిద్రలేమితో బాధ‌ప‌డే వారు ఈ గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

Pumpkin Seeds how many of them you have to take daily
Pumpkin Seeds

అదే విధంగా బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ గుమ్మ‌డి గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఇక ఈ గుమ్మ‌డి గింజ‌ల‌ను మ‌నం రోజూ అర క‌ప్పు మోతాదులో తీసుకోవ‌చ్చు. అలాగే వీటిని ఉద‌యం లేదా సాయంత్రం స్నాక్స్ స‌మ‌యంలో కూడా తీసుకోవ‌చ్చు. ఈ గింజ‌ల‌ను ప‌చ్చిగా లేదా ఏమి వేయ‌కుండా దోర‌గా వేయించి కూడా తీసుకోవ‌చ్చు. అయితే మ‌న శ‌రీరానికి మేలు చేసేవే అయిన‌ప్ప‌టికి ఈ గుమ్మ‌డి గింజ‌ల‌ను ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు. వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నొప్పి, క‌డుపు ఉబ్బ‌రం,మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరిగే అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఈ గుమ్మ‌డి గింజ‌ల‌ను త‌గిన మోతాదులో తీసుకుంటూ చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొందాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.

Share
D

Recent Posts