ఇటీవల కాలం లో ఏలియన్స్ గురుంచి అన్వేషించడం ఎక్కువ అయ్యింది, నాసా మొదలు ఇస్రో వరకు ప్రతి ఒక్కరు ఏలియన్స్ జాడ కోసం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొన్ని కధనాల ప్రకారం అమెరికన్ ల చేతికి ఒక ఏలియన్ స్పేస్ షిప్ దొరికింది అని, అందులో ఉండే ఏలియన్లని బంధించి ఎవరికీ తెలియని రహస్య స్థావరంలో ఉంచారని చెబుతున్నారు, ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా చాలా గోప్యంగా ఉంచారని చెబుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నెల్లూరు లో ఏలియన్లు సంచరించాయి అనడానికి వీడియో రుజువులు దొరికాయి, ఆ వీడియో లో అవి చూడటానికి క్రైయిస్తవులు చెప్పే ఏంజెల్స్ లాగా ఉన్నాయ్ అని కొందరు అంటే, కాదు అవి ఏలియన్స్ ఏ అని మరి కొందరి వాదన, ఆ వీడియో లో ఉన్నవి గ్రాఫిక్స్ అయ్యుండొచ్చు కదా అని కొందరు ప్రశ్నలను రేకెత్తించారు, ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో చాల చోట్ల జరిగాయి అని కొంత మంది చెబుతుంటారు.
ఏలియన్ స్పేస్ షిప్ లని యుఎఫ్ఓ అని పిలుస్తారు, అయితే ఆ యుఎఫ్ఓ లని చూశామని చాలా మంది ప్రజలు చెబుతూ ఉంటారు, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఏలియన్స్ విషయం గురించి సామాన్య వ్యక్తుల నుండి శాస్త్రవేత్తల వరకు మాట్లాడుకోవడం జరుగుతూనే ఉంది దాదాపు ఏడున్నర దశాబ్దాల నుంచి శాస్త్రవేత్తలకు చిక్కక, ఆనవాళ్లు దొరక్క ముప్పతిప్పలు పెడుతున్న అంశం ఏదైనా ఉందంటే అది గ్రహాంతర వాసుల అంశమే. ఇప్పటికీ ఈ జీవులు సైంటిస్టులకు దొరక్క, దొరికినట్లే దొరికి మాయమవుతూ ఇంకా చెప్పాలంటే ఊరిస్తూ మిలియన్ డాలర్ల ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. 95 కాంతి సంవత్సరాల దూరం నుంచి అంతుపట్టని రేడియో సిగ్నల్స్ వస్తున్నాయని అవి ఏలియన్స్ కి సంబంధించినవేనని ఆ మధ్య కొన్ని కథలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు వీటిని నాసా దాచిపెడుతోందని వాదన వినిపిస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ నాసా మాజీ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ కెవిన్ నూథ్ చెప్పారు.
భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే ఇతర గ్రహాలపై కూడా జీవరాశులు ఉన్నాయన్న వాదన ఓ వైపు, దివంగత ఖగోళ మేధావి’ స్టీఫెన్ హాకింగ్’ లాంటి వాళ్ల హెచ్చరికలు. కొందరిలో ‘ఏలియన్స్’ పట్ల విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. గతంలో నాసా మాజీ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ కెవిన్ నూథ్ వీటిపై సంచలన ఆరోపణలు చేశారు.ఏలియన్ల మనుగడ గురించి తెలిసి కూడా నాసా గోప్యత ఎందుకు ప్రదర్శిస్తోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ కెవిన్ నూథ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ: ‘2002 నాసా కాంటాక్ట్ కాన్ఫరెన్స్‌లో జరిగిన విషయం ఇప్పటికీ నాకు గుర్తుంది. గ్రహాంతరవాసుల అంశంపైనే శాస్త్రవేత్తలమంతా ప్రధానంగా చర్చించాం. అప్పటికే నాసా సేకరించిన సమాచారం గందరగోళంగా ఉంది. ఏలియన్ల మనుగడ నిజమన్న భావనను కొందరు నొక్కివక్కానిస్తే. మరికొందరు నాన్‌సెన్స్ అని కొట్టేపారేశారని తెలిపారు.
మేం కొందరం సభ్యులం తటస్థంగా ఉన్నాం. కానీ, అందరిలో ఏకాభిప్రాయం ఒక్కటే. ప్రజల్లో ఆసక్తి, అనాసక్తి అన్న అంశాలను పక్కనపెడితే వాటి మనుగడపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం నాసాకు ఉంది. ఆకాశంలో కనిపించి అదృశ్యమయ్యే యూఎఫ్ఓల మాటేంటి? అవి గ్రహాంతర వాసుల నౌకలా? కాదా? అక్కడక్కడ భూమైదానాల్లో ఏర్పడే మిస్టరీ ముద్రలేంటి? సందేశాలు పంపిన దాఖలాల సంగతేంటి? ఈ రహస్యాలన్నీంటికి నాసా దగ్గర సమాధానాలు ఉన్నాయి. కానీ ఎందుకు దాస్తున్నారో అర్థం కావట్లేదని’ ఆయన ఆరోపించారు. నిజంగానే గ్రహాంతర వాసులతో మనుషులకు ప్రమాదం పొంచి ఉందా? ఒకవేళ అనుసంధానం అయితే అవి మనుషులను చంపేస్తాయా అన్నదాని మీద కూడా నాసా క్లారిటీ ఇవ్వడం లేదు. ఏలియన్స్ ఉనికి చుట్టూ ఉన్న వాదన సంగతి పక్కనపెడితే.. ప్రజల్లో పెరిగిపోయిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం నాసాకు ఖచ్ఛితంగా ఉందని కెవిన్ తెలిపారు.
భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే ఇతర గ్రహాలపై కూడా జీవరాశులు ఉన్నట్టు సాక్ష్యాధారాలతో సహా చూపిస్తామని నాసా ఇది వరకే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఏలియన్ల విషయంలో మరో 20 ఏళ్లలో వాటి జాడను ప్రజల ముందు ఉంచుతామని నాసా ఇంతకుముందు తెలిపింది. అయితే ష్టీఫెన్ హాకింగ్ హెచ్చరికల నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తోందని తెలుస్తోంది. గ్రహాంతర వాసుల మనుగడ గురించి మనిషి ఎంత లోతుగా పరిశీలిస్తున్నాడో, అదే విధంగా మన గురించి కూడా గ్రహాంతర వాసులు పరిసలిస్తున్నారా ? అవును అనే కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు.