వినోదం

సావిత్రి చేసిన చిన్న పొరపాటు.. పెద్ద రహస్యం బయట పడింది, అదేంటో తెలుసా …?

సావిత్రి తెలుగు సినిమా పరిశ్రమలో మకుటం లేని మహరాణి.. దశాబ్దాల సినీ చరిత్రలో సావిత్రిని మించిన నటి లేదు,ఇకపై రాదు కూడా..ఆ విధంగా తన పేరుని చరిత్రపుటల్లో లిఖించుకున్న మహానటి సావిత్రి..సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమానే మహానటి. యువదర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటిపై గ‌తంలో ఆస‌క్తి బాగా పెరిగింది. ఈ సినిమాలో సావిత్రికి సంబంధించిన ఎన్నో విషయాలు పొందుపర్చారు. అందులో భాగంగా సావిత్రి దాచిన రహస్యం తన మూలంగానే ఏ విధంగా బయటపడింది అనేది సోషల్ మీడియాలో వైరలవుతుంది..అదేంటంటే..సావిత్రి వివాహ విషయం..

సావిత్రి వ్యక్తిగత జీవితం గురించి అనేక పుకార్లు ఉన్నాయి. ఆ సందేహాలన్నింటిని మహానటి సినిమా నివృత్తి చేసింది. నాగ అశ్విన్ సావిత్రి జీవితం గురించి శోధించి మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కీర్తి సురేష్ ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో నటించింది. సావిత్రి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలిశాయి. సావిత్రికి వింటేజ్ కార్లంటే విపరీతమైన మోజు. ఆమె నటిగా ఉన్న సమయంలో ఎవరి దగ్గర లేనన్నీ వింటేజ్ కార్ల కలెక్షన్ ఉండేది. ఏఎన్నార్, ఎన్టీఆర్ తో సమానంగా పారితోషకం అందుకున్న ఏకైన నటి సావిత్రి మాత్రమే అని కూడా చిత్రం ద్వారా తెలిసింది. సావిత్రి వివాహం గురించి కూడా అప్పట్లో పుకార్లు ఉండేవి.పెళ్లి జరిగిన ఎన్నోఏళ్లకు ఆ విషయం బయటపడింది. అది కూడా అనూహ్యపరిస్థితుల్లో…

savitri did this big mistake in her life

లక్స్ వాణిజ్య ప్రకటన కోసం ఒప్పంద పత్రంలో సావిత్రి.. సావిత్రి గణేశన్ అని పొరపాటుగా సంతకం చేశారు. జెమినీ గణేశన్ తో వివాహం జరిగిందనే రహస్యం అలా బయట పడింది… వాస్తవానికి జెమిని గణేశన్ తో కలిసి సావిత్రి నటించిన తొలిచిత్రం మనంపోల మాంగల్యం..ఆ సినిమా టైం లోనే సావిత్రి, జెమిని గణేశన్ పెళ్లి చేసుకున్నారట.. అప్పటికే పెళ్ళయి, పిల్లలుండి, మరో నటితో అనుబంధం కొనసాగిస్తున్నాడని తెలిసీ జెమినీని సావిత్రి ప్రేమించడం, పెళ్ళాడడం విశేషం.పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకి ఆ విషయం బయటికి వచ్చింది.అతడికోసం మద్యానికి కూడా బానిసయ్యింది సావిత్రి.

సావిత్రి, షావుకారు జానకి మంచి స్నేహితులు.. జెమిని గణేషన్ కి కూడా జానకి ఆప్తులే. బ్రదర్ అంటూ ఆప్యాయంగా పిలిచేవారట జానకి జెమిని గణేశన్ ని.. అయినప్పటికీ ‘అతని కోసం నీ జీవితం, నీ పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకోకు. జీవితంలో అందరం తప్పులు చేస్తాం. నేనూ చేశాను. కానీ, ఆ తప్పుల నుంచి బయటపడేలా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య కుదరనప్పుడు మానసికంగా డిటాచ్‌ అవ్వాలి’ …ఇలా సావిత్రితో చెబుతుండేదాన్ని. అందుకే, చాలా సందర్భాల్లో ‘జానకీ! నీకున్న ధైర్యం నాకు లేదు’ అని బాధపడేది అంటూ అప్పటి విషయాలను గ‌తంలో చెప్పారు షావుకారు జాన‌కి.

Admin

Recent Posts