Off Beat

ఆస్తి కోసం తండ్రితో గొడ‌వ‌ప‌డ్డ కూతుళ్లు.. ఆస్తి ప‌త్రాల‌ను హుండీలో వేసిన తండ్రి..

<p style&equals;"text-align&colon; justify&semi;">కుమార్తెలపై కోపంతో ఓ తండ్రి ఆలయానికి రూ&period; 4 కోట్ల ఆస్తుల విరాళం ఇచ్చిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది&period; తమిళనాడు-తిరువణ్ణామలై జిల్లా అరణి సమీపంలోని కోనైయూర్ గ్రామానికి చెందిన విజయన్ రిటైర్డ్ ఆర్మీ జవాన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భార్య&comma; ఇద్దరు కుమార్తెలతో కలిసి పడవేడు సమీపంలోని కలికాపురంలో నివాసం ఉంటున్నారు&period; కొన్ని నెలల క్రితం తండ్రి విజయన్‌కి&comma; కుమార్తెలకు మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం తలెత్తింది&period; దీంతో విజయన్ రూ&period;4 కోట్ల విలువ చేసే రెండు ఇళ్లు&comma; పొలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను పాతవేడు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీరేణుకాంబాల్ అమ్మవారి ఆలయ హుండీలో వేసేశాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89849 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;vijayan&period;jpg" alt&equals;"person given his properties and net worth to temple " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కష్టపడి సంపాదించిన ఆస్తుల విషయంలో తన కుమార్తెలు తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు&period; విషయం తెలుసుకుని తమ తండ్రి హుండీలో వేసిన ఆస్తి పత్రాలను ఇచ్చేయాలంటూ విజయన్‌ కుమార్తెలు ఆలయ అధికారులను సంప్రదించారు&period; విరాళంగా వచ్చిన ఆస్తులను తిరిగి ఇవ్వడం కుదరదని&comma; నిబంధనల ప్రకారం జాయింట్ కమిషనర్ కార్యాలయంలో పత్రాలను అప్పగిస్తామని అధికారులు స్పష్టం చేశారు&period; ఈ ఘటన ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది&period; దీనిపై న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts