నేను చెన్నై లో పని చేస్తున్న. పోయిన సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుందామని నిశ్చయించుకొన్నాను. మాల బట్టల కోసం ఒక చిన్న దుకాణానికి వెళ్ళి రెండు పంచెలు, రెండు చొక్కాలు, రెండు కండువాలు తీసుకున్న. మొత్తం పద్దెనిమిది వందల రూపాయలు అయింది. రెండొందలు తగ్గించమని అడిగాను. దుకాణ దారుడు నన్న చాల అవమాన పరిచే విధంగా వ్యాఖ్యలు చేసాడు. మొదట్నించి అతను మాట్లాడే తీరు బాగోలేదు.
సాధారణంగా చెన్నై లో ఏ దుకాణం లోనూ కొనుగోలుదారులకు మర్యాద ఇవ్వరు. ఇతను అంతకు మించి. కనీసం వంద రూపాయలు అయినా తగ్గించమన్నాను. ఇంకా చిరాకుగా మాట్లడాడు. వెంటనే నేను అక్కడ నుంచి బయటకు వచ్చి లోకల్ బస్సు లో శరవణా స్టోర్స్ కి వెళ్ళాను. శరవణా స్టోర్స్ అంటే చెన్నైలో అతి పెద్ద షాపింగ్ మాల్. చాలా చోట్ల వీళ్ళకి బ్రాంచీలు ఉన్నాయి. అక్కడ అన్ని నిర్ణయించిన ధరలకే అమ్ముతారు. బేరాలు ఉండవు.
అవే రెండు పంచలు, రెండు కండువాలు, రెండు చొక్కాలు నాకు తొమ్మిదొందల తొంబై రూపాయలకు వచ్చాయి. అక్కడ పనిచేసే సిబ్బంది ఎవరూ మనల్ని కించపరిచేలా మాట్లాడరు. పైగా ఏసీ లో షాపింగ్ చేసిన అనుభవం బాగుంది. అందుకే నేను చిన్న వస్తువులు కొన్నా వీలైనంత వరకూ పెద్ద పెద్ద మాల్స్ లోనే కొంటా.