Off Beat

చంద్రగ్రహణం పౌర్ణమి రోజే ఏర్పడడానికి కారణం ఏమిటి?

సూర్యుని చుట్టూ భూమి తిరిగితే.. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడ‌న్న సంగ‌తి తెలిసిందే. చంద్రుడు భూమికి ఉన్న స‌హ‌జ‌సిద్ధ‌మైన ఉప‌గ్ర‌హం. ఈ క్ర‌మంలోనే భూమిపై ప‌డే సూర్య కాంతి చంద్రునిపై కూడా ప‌డుతుంది. ఇక భూమిపై సూర్యకాంతి నిరంతరం పడుతూనే ఉంటుంది.

సూర్యకాంతి పడినపుడు భూమి వెనక నీడ ఏర్పడుతుంది. కానీ అక్కడ అంతా అంతరిక్షం కాబట్టి ఆ నీడ కనపడదు. ఆ నీడపడే ప్రాంతంలోకి చంద్రుడు వచ్చాడనుకోండి. ఆ చంద్రుడే ఓ గోడలా ఉండటంతో భూమి నీడ దానిపై పడుతుంది. ఆ నీడ పరుచుకున్నంతమేర చంద్రుడు కనబడదు. కాబట్టి దాన్నే మనం ‘చంద్రగ్రహణం’ అంటాం.

why lunar eclipse happens only on pournami

భూమి నీడలోకి రావడానికి ముందు చంద్రునిపై కూడా సూర్యకాంతి పడుతుంది. అంటే, భూమిపై నుంచి చంద్రుడు గుండ్రంగా, పూర్తిగా కనిపిస్తుంటాడు. అదే పౌర్ణమి. పౌర్ణమి నాడు చందమామగా కనిపిస్తున్నపుడే చంద్రుడు క్రమంగా భూమి నీడలోకి రాగలడు. అపుడే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

Admin

Recent Posts