mythology

పెళ్లిలో అరుంధ‌తి న‌క్ష‌త్రాన్ని చూపిస్తే ఎందుకు క‌నిపించ‌దు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అరుంధతి జన్మవృత్తాంతం శివపురాణంలోనూ&comma; భాగవత పురాణంలోనూ కనిపిస్తుంది&period; అరుంధతి జన్మవృత్తాంతాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షి గణాలకు ఇలా వివరించాడు&period; ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత రూపవతియైన కన్యను&comma; వర్ణింపనలవికాని సుందరాకారుడిని సృష్టించాడు&period; ఆ కన్యపేరు సంధ్యా&period; ఆ యువకుని పేరు మన్మథుడు&period; సృష్టికార్యంలో తనకు సహాయపడమని ఆ యువకుడికి చెబుతూ బ్రహ్మ అతడికి అయిదు బాణాలను ఇచ్చాడు&period; మన్మథుడు బాణ శక్తిని పరీక్షింపదలచి వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టాడు&period; అప్పుడు బ్రహ్మతో సహా అక్కడ ఉన్నవారందరూ సంధ్య‌ను చూసి మోహానికి లోనయ్యారు&period; ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుడిని ప్రార్థించగా&comma; ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై&comma; పరిస్థితిని చక్కదిద్దాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెప్పపాటు కాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపంతో ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని మన్మథుడికి శాపం ఇచ్చాడు&period; తన వల్ల ఇంతమంది నిగ్రహం కోల్పోయారని సంధ్య చంద్రభాగా నదీ తీరంలో తపస్సు పేరిట తనువు చాలించేందుకు పయనమైపోయింది&period; అప్పుడు బ్రహ్మ వశిష్ట మహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించాలిందిగా కోరాడు&period; వశిష్టుడు ఆమెకు à°¶à°¿à°µ‌ మంత్రానుష్టానం వివరించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు&period; సంధ్య తదేక నిష్టతో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది&period; శివుడు ఆమెను వరం కోరుకొమ్మన్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73171 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;arundhati-star-1&period;jpg" alt&equals;"why arundhati star is not visible during marriage " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగరాదనే వరాన్ని ఆమె కోరుకుంది&period; శివుడు ఆమెను మరొక వరాన్ని కూడా కోరుకోమన్నాడు&period; అపుడు సంధ్య నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదృష్టితో చూచినట్లయితే వారు పుంసత్వాన్ని కోల్పోవాలనీ&comma; అంతేకాక&comma; తాను పుట్టగానే అనేకమందికి కామ వికారం కలిగించాను కనుక ఈ దేహం నశించిపోవాలని కోరుకుంది&period; శివుడు తథాస్తు అంటూ&comma; మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు&period; ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్యరాలివై శరీరాన్ని దగ్ధం చేసుకుని&comma; తిరిగి అదే అగ్నికుండంనుంచి నీవు జన్మిస్తావు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో అతడే నీ భర్త అవుతాడని చెప్పి అంతర్థానమయ్యాడు&period; శివాజ్ఞగా సంధ్య తన శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది&period; అగ్నికుండంనుంచి తిరిగి జన్మించింది&period; సంస్కృత భాషలో అరుం అంటే అగ్ని&comma; తేజము&comma; బంగారువన్నె అనే అర్థాలున్నాయి&period; ధతీ అంటే ధరించినదనే అర్థం ఉంది&period; అగ్నినుంచి తిరిగి పుట్టింది కనుక ఆమె అరుంధతి అయింది&period; పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి&comma; వశిష్టునికి ఇచ్చి వివాహం చేశాడు&period; అరుంధతి తన పాతివ్రత్య మహిమ వల్ల త్రిలోకపూజ్యురాలైంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-73172" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;arundhati-star&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని&comma; మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్ళి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు&period; అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబుతారు&period; మాఘ మాసాది పంచ మాసాల కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రవేళ కానరాదు&period; రాత్రి పూట చంద్రుడ్ని&comma; నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతంది&period; అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది&period; అరుంధతి నక్షత్రం సప్తర్షిమండలంలో వుండే చిన్న నక్షత్రం&period; à°¶à°¿à°¶à°¿à°°&comma; వసంత&comma; గ్రీష్మఋతువులందు సాయంకాల సమయాన&comma; మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారు జామున కనిపిస్తుంది&period; అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి&period; గాలిపటం ఆకారంలో 7 నక్షత్రాలు ఉంటాయి&period; అవే సప్తషులు&period; తోక భాగంలో క్రిందినుండి రెండవది వశిష్ఠుడు&period; వశిష్ఠుని ప్రక్కనే అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts