Atika Mamidi : ప్రకృతి మనకు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలను ప్రసాదించింది. వేలు, లక్షలు ఖర్చు పెట్టినా నయం కాని అనారోగ్య సమస్యలను ఈ ఔషధ మొక్కలతో నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో అటిక మామిడి మొక్క కూడా ఒకటి. అటిక మామిడి మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పూర్వీకులు పైసా ఖర్చు లేకుండా అనారోగ్య సమస్యల నుండి బయటపడి ఎంతోకాలం ఆరోగ్యంగా బ్రతికేవారు. దానికి కారణం వారు ఔషధ గుణాలు కలిగిన మొక్కలను ఉపయోగించడమేనని ఆధారాలు కూడా ఉన్నాయి.
ఇలా మన పూర్వీకులు ఉపయోగించిన మొక్కల్లో అటిక మామిడి కూడా ఒకటి. దీనిని అంటు మామిడి అని కూడా అంటారు. మూత్రపిండాల సమస్యలను నయం చేయడంలో ఈ మొక్క ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాల సమస్యలు అనగా మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రశయంలో ఇన్ ఫెక్షన్ లు వంటి సమస్యలను తగ్గించడంలో అటిక మామిడి మొక్క దివ్యౌషధంగా పని చేస్తుంది. ఈ మొక్క ఆకులను మూత్రపిండాలకు సంబంధించిన ఇంగ్లిష్ మందులలో ఎక్కువగా వాడుతుంటారు. అటిక మామిడి మొక్క రసాన్ని తాగడం వల్ల మూత్రపిండాలు ఇన్ ఫెక్షన్ లకు గురి కాకుండా ఉంటాయి.
ఈ మొక్క ఆకులతో కూరను కూడా వండుకుని తింటారు. కేవలం మూత్రపిండాల సమస్యలనే కాకుండా తల నుండి పాదాల వరకు వచ్చే వివిధ రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా అటిక మామిడి మొక్క మనకు ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకుల రసాన్ని తాగడం వల్ల డయాలసిస్ చేయించుకునే అవసరం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అటిక మామిడి ఆకులతో రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అటిక మామిడి తీగలను తెచ్చుకుని ఆ తీగలను ఆకులతో సహా ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పావు లీటర్ నీటిని పోసి వేడి చేయాలి.
నీళ్లు వేడయ్యాక తరిగిన అటిక మామిడి మొక్క ఆకులను, పువ్వులను, కాడలను వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత రసాన్ని వడకట్టి ఒక గ్లాసులోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న అటిక మామిడి రసాన్ని క్రమం తప్పకుండా రోజూ అర గ్లాస్ చొప్పున తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. మూత్రాశయంలో ఇన్ ఫెక్షన్ లు మాయం అవుతాయి. మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఈ అటిక మామిడి రసాన్ని తాగడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.