Guava Leaves : జామ చెట్టు గురించి త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Guava Leaves : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లలో జామ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ఎప్పుడుప‌డితే అప్పుడు దొరుకుతూనే ఉంటాయి. జామ చెట్లు కూడా దాదాపుగా అంద‌రి ఇండ్ల‌లో ఉండ‌నే ఉంటాయి. జామ‌కాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. కేవ‌లం జామ‌కాయ‌లే కాదు, జామ ఆకులు కూడా ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. జామ ఆకులలోలో ఉండే ఔష‌ధ గుణాలు గురించి, వాటిని ఉప‌యోగించడం వ‌ల్ల ఏయే అనారోగ్య స‌మస్య‌లను న‌యం చేసుకోవ‌చ్చు.. అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం.

డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు ప్లేట్ లెట్స్ త‌గ్గిపోతాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. జామ ఆకుల‌ను ఉప‌యోగించి మ‌నం ఈ ప్లేట్ లెట్స్ ను పెంచుకోవ‌చ్చు. దీని కోసం తొమ్మిది జామ ఆకుల‌ను తీసుకుని 3 క‌ప్పుల నీటిలో వేసి అవి ఒక క‌ప్పు క‌షాయం అయ్యే వ‌ర‌కు మ‌రిగించి వ‌డ‌క‌ట్టి చ‌ల్లార‌బెట్టుకోవాలి. ఈ కషాయాన్ని డెంగ్యూ జ్వ‌రంతో బాధ‌ప‌డే వారికి రోజుకు మూడు పూట‌లా తాగించ‌డం వ‌ల్ల రక్తంలో ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. జామ ఆకుల‌తో టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

Guava Leaves amazing health benefits
Guava Leaves

10 జామ ఆకుల‌ను తీసుకుని లీట‌ర్ నీటిలో వేసి మ‌రిగించి వ‌డ‌క‌ట్టుకోవాలి. ఇలా టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌న శరీరంలో రోగ నిరోధ‌కశ‌క్తి పెరుగుతుంది. శ‌రీరానికి కావ‌ల్సినంత విట‌మిన్ సి ల‌భిస్తుంది. షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. జామ ఆకుల‌తో చేసిన టీని రాత్రి పూట తాగ‌డం వ‌ల్ల నిద్ర బాగా ప‌డుతుంది. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల మెద‌డు ప‌ని తీరు కూడా పెరుగుతుంది. మ‌తిమ‌రుపు కూడా త‌గ్గుతుంది.

జామ ఆకుల‌తో టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల శ‌రీరలంలో పేరుకుపోయిన కొవ్వు క‌రిగి బ‌రువు కూడా త‌గ్గుతారు. జీర్ణ శ‌క్తిని పెంచే గుణం కూడా జామ ఆకుల టీ కి ఉంటుంది. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. ఆక‌లి పెరుగుతుంది. డ‌యేరియా కూడా త‌గ్గుతుంది. ఈ ఆకుల‌ను న‌మిలి ర‌సాన్ని మింగ‌డం వ‌ల్ల నోటిపూత త‌గ్గుతుంది. ఈ టీని త‌ర‌చూ తాగుతూ ఉండ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గా ఉంటాయి.

D

Recent Posts