Prickly Pear Cactus : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. దీని కాయ‌ల‌ను తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

Prickly Pear Cactus : మ‌న‌కు బాగా తెలిసిన ఎడారి మొక్క‌ల‌లో నాగ‌జెముడు మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క ఎడారుల్లోఎక్కువ‌గా పెరుగుతుంది. అలాగే కొంద‌రు దీనిని అలంక‌ర‌ణ కోసం పెర‌ట్లో పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క పొడ‌వాటి, ప‌దునైన ముళ్లుల‌ను క‌లిగి ఉంటుంది. ఈ మొక్క‌కు కాయ‌లు కూడా కాస్తాయి. ఈ కాయ‌ల‌ను ఇత‌ర దేశాల వారు ఎక్కువ‌గా తింటూ ఉంటారు. ఈ కాయ‌లు రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా క‌లిగి ఉన్నాయి. ఈ కాయ‌లు ప‌చ్చిగా ఉన్న‌ప్పుడు ఆకుప‌చ్చ రంగులో పండిన త‌రువాత బ్రౌన్ క‌ల‌ర్ లో ఉంటాయి. ఈ కాయ‌లు కూడా చెట్టు వ‌లె ముళ్లుల‌ను క‌లిగి ఉంటాయి. ఈ కాయ‌ల‌ను క‌ట్ చేసేట‌ప్పుడు కూడా జాగ్ర‌త్త‌గా క‌ట్ చేయాలి. నాగ‌జెముడు పండ్ల‌ను ఎలా క‌ట్ చేసుకోవాలి.

అలాగే వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా బాగా పండిన నాగ‌జెముడు కాయ‌ల‌ను జాగ్ర‌త్త‌గా సేక‌రించాలి. త‌రువాత వాటిపై ఉండే ముండ్లు పోయేలా గురుకు ప్ర‌దేశంపై రుద్దాలి. త‌రువాత ఈ కాయ‌లకు లోతుగా ఉండే తొడిమెను తొల‌గించాలి. దీని లోప‌ల మ‌రో పెద్ద ముళ్లు ఉంటుంది క‌నుక తొడిమ‌ను తొల‌గించాలి. త‌రువాత కాయ‌ను నిలువుగా క‌ట్ చేసి పై భాగాన్ని తీసేసి లోప‌ల ఉండే గుజ్జును తీసుకోవాలి. దీని లోప‌ల గింజ‌లు ఉంటాయి క‌నుక గుజ్జును చ‌ప్ప‌రించి గింజ‌ల‌ను తీసివేయాలి. ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

Prickly Pear Cactus fruit benefits in telugu how to cut it
Prickly Pear Cactus

ఈ కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే నాగ‌జెముడు కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవక్రియ‌ల రేటు పెరుగుతుంది. ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. ఎదిగే పిల్ల‌ల‌కు ఈ కాయ‌ల‌ను ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది. దంతాలు ధృడంగా త‌యార‌వుతాయి. వ‌య‌సు పైబ‌డ‌డం వ‌ల్ల తలెత్తే ఎముక‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అలాగే మ‌తిమ‌రుపు స‌మ‌స్య రాకుండా ఉంటాయి. ఈ కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.వృద్దాప్య ఛాయ‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి.

అలాగే ఈ కాయ‌లను తిన‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. పెద్ద ప్రేగు క్యాన్స‌ర్ వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారికి ఈ పండ్లు అద్భుత‌మైన ఔష‌ధంగా ప‌ని చేస్తాయి. అలాగే మైగ్రేన్ త‌ల‌నొప్పితో బాధ‌ప‌డే వారు ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జుట్టు మ‌రియు గోర్లు అందంగా త‌యార‌వుతాయి. అలాగే పురుషులు ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వారిలో లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుంది. వీర్య క‌ణాల సంఖ్య పెరుగుతుంది. ఈ విధంగా నాగ‌జెముడు పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts