ప్రస్తుతం మనకు తినేందుకు రకాల స్నాక్స్, చిరుతిళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బిస్కెట్లు కూడా ఒకటి. అనేక కంపెనీలు రకరకాల బిస్కెట్లను తయారు చేసి అందిస్తున్నాయి. అయితే బిస్కెట్లను తినడం ఆరోగ్యానికి మంచిదేనా ? ఏమైనా ప్రభావం పడుతుందా ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బిస్కెట్లను సహజంగానే మైదా పిండి, చక్కెరతో తయారు చేస్తారు. ఇవి రెండూ మనకు హాని కలగజేస్తాయి. మైదా పిండి సకల అనారోగ్యాలకు కారణం. అందువల్ల సాధారణ బిస్కెట్లను తినకపోవడమే మంచిది.
అయితే కొన్ని రకాల బిస్కెట్లను మల్టీ గ్రెయిన్ పిండి లేదా రాగులు, సజ్జలు, జొన్నలు వంటి చిరుధాన్యాల పిండిలతో తయారు చేస్తున్నారు. కనుక అలాంటి బిస్కెట్లను తినవచ్చు. బిస్కెట్లను కొనే ముందు వాటి ప్యాక్ పై చూడాలి. మైదా పిండి, చక్కెర వంటి వాటితో కాకుండా ఇతర తృణ ధాన్యాలు, బెల్లం వంటి వాటితో తయారు చేశారా, లేదా అనేది గమనించాలి. మైదా పిండి, చక్కెర కాకుండా మిగిలిన వాటితో బిస్కెట్లను తయారు చేస్తే గనుక ఆ బిస్కెట్లను తినవచ్చు. అంతేకానీ మైదా పిండితో తయారు చేసిన బిస్కెట్లను తినకూడదు.
ఇక మైదా పిండితో తయారయ్యే బిస్కెట్లే కాదు, దాంతో తయారయ్యే ఏ పదార్థాన్నయినా అస్సలు తినరాదు. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల బేకరీ పదార్థాల్లో మైదా పిండిని ఎక్కువగా వాడుతారు. కనుక ఆ పదార్థాలను తినడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పవచ్చు. వాటిని మానేయాలి. చిరు ధాన్యాలతో తయారు చేసిన వాటిని తినాలి. దీంతో ఆకలి తగ్గుతుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు. పోషకాలు లభిస్తాయి.