ప్ర‌శ్న - స‌మాధానం

Bananas For Diabetics : మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజు అరటిపండు తినవచ్చా..? ప్రతిరోజు తింటే ఏమవుతుంది..?

Bananas For Diabetics : ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకీ వేగంగా పెరుగుతోంది. మధుమేహం అనేది మారుతున్న జీవనశైలి, పోషకాహార లోపం కారణంగా అభివృద్ధి చెందుతున్న వ్యాధి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ ఆహారం తీసుకోవాలన్న ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ ఆహారం తీసుకున్న కూడా బ్లడ్ షుగర్ లెవల్స్ లో ఎలాంటి మార్పులు ఏర్పడతాయో అనే భయం డయాబెటిస్ పేషెంట్లలలో ఉంటుంది. అందువలన ఏ ఆహార పదార్థాలు తినాలి అన్నకూడా భయంతో వెనక్కి తగ్గుతారు. ముఖ్యంగా పండ్లు తినవచ్చా లేదా అనే విషయంలో అనేక సందేహాలు ఉంటాయి. అరటిపండ్లు తియ్యగా ఉంటాయి కనుక మధుమేహం ఉన్నవారు తినకూడదు అని ఒక అపోహ కూడా ఉంది.

డయాబెటిస్ పేషెంట్స్ కి ఆహారంలో రక్తంలోని చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు దోహదం చేయని ఆహారాలు ఉండాలి. పండ్లలో సహజ చక్కెర ఫ్రక్టోజ్ ఉన్నందున మధుమేహ వ్యాధిగ్రస్తులు సాధారణంగా పండ్లు తినకూడదనే అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. చాలా పండ్లలో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. అలాంటి పండ్లులో అరటిపండు కూడా ఒకటి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు దోహదం చేయవు. ఏ ఆహారమైనా పరిమితిని బట్టి తీసుకుంటే, అవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి.

can diabetics take banana what happens

అరటిపండు అనేది సాధారణంగా అల్పాహారంలో భాగంగా తినే పండు. ఇది తీపి రుచిని కలిగి ఉంటుంది మరియు పిండి పదార్థాలు మరియు చక్కెర రెండింటినీ కలిగి ఉంటుంది. దీని వలన అరటిపండు మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచగలదని, మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండు తినడం ఆరోగ్యకరమా అనే సందేహాలు తలెత్తుతుంటాయి. ఒక పెద్ద అరటిపండులో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచడానికి కారణమవుతాయి. మధ్య తరహా అరటిపండులో 14 గ్రాముల చక్కెర మరియు 6 గ్రాముల స్టార్చ్ ఉంటుంది. కానీ అరటిపండులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అరటిపండులో ఫైబర్ అధికంగా ఉండటం వలన డయాబెటిస్ పేషెంట్లులో ఎక్కువగా ఏర్పడే మలబద్ధక సమస్య తగ్గుతుంది.

అరటిపండ్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ కలిగి ఉంటాయి మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పండు సరైన ఎంపిక అని చెప్పవచ్చు. న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ అభిప్రాయం ప్రకారం అరటిపండులో చక్కెర మరియు పిండి పదార్థాలు ఉంటాయి. వీటితో పాటు ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది మరియు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండును తినవచ్చు, కానీ మితంగా తినవచ్చు అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మధుమేహం ఉన్నవారు అరటిపండ్లను ఏ పరిమాణంలో తినాలి అంటే.. ఒక చిన్న అరటిపండు వారానికి రెండు లేదా మూడుసార్లు తీసుకోవడం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఎలాంటి ప్రమాదమూ ఉండదు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ అరటిపండును తినకూడదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Share
Admin

Recent Posts