ప్ర‌శ్న - స‌మాధానం

Soap : మీరు వాడుతున్న స‌బ్బు మంచిదేనా.. దాన్ని ఎలా గుర్తించ‌డం.. ఇలా సుల‌భంగా తెలుసుకోండి..!

Soap : శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మనకు అత్యంత అవసరం. ఈ నేపథ్యంలోనే రోజుకి కనీసం రెండు సార్లయినా స్నానం చేయాలని చెబుతారు. అయితే రెండుసార్లు కాకున్నా ఒకసారి చేసినా శరీరాన్ని మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే ఇందుకోసం ఎవరైనా సాధారణంగా ఏం వాడతారు..? సబ్బు లేదా బాడీ వాష్. బాడీ వాష్ అనేది హై క్లాస్ వర్గీయులు ఎక్కువగా వాడేది. ఇక సబ్బు విషయానికి వస్తే దీన్ని అత్యధిక శాతం మంది వాడతారు. అయితే ఏ సబ్బు వాడినా అది శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుతుందని ఎలా చెప్పగలరు..? సదరు కంపెనీ ఇచ్చే యాడ్‌ని చూశా..? కాదు. అలా చెప్తే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే లాభాపేక్ష కోసం కంపెనీలు ఎన్నో రకాల ప్రకటనలు ఇచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటాయి.

అయితే సబ్బు ఎంత సమర్థవంతమైనది, ఎంత నాణ్యంగా పనిచేస్తుంది, ఎంతటి శుభ్రతనిస్తుంది.. ఎలా తెలుసుకోవడం..? అందుకోసమే టీఎఫ్‌ఎం అనే పదం ఉపయోగపడుతుంది. మీరు వాడుతున్న సబ్బు ప్యాకింగ్‌ను ఒక్క సారి సరిగ్గా గమనించండి. దానిపై టీఎఫ్‌ఎం 70శాతం, 67 శాతం, 82 శాతం అని రాసుందా..? ఆ అదే..! అదే సబ్బు నాణ్యతను ధ్రువీకరిస్తుంది. అసలు టీఎఫ్‌ఎం అంటే ఏమిటి..? టీఎఫ్‌ఎం అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. అంటే ఈ టీఎఫ్‌ఎం శాతం ఎంత ఎక్కువగా ఉంటే ఆ సబ్బు అంతటి నాణ్యమైన గుణాలను కలిగి ఉంటుంద‌న్న‌మాట‌.

which soap is healthy

భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) ప్రకారం సబ్బులను 3 రకాలుగా విభజించారు. అవి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. 76 అంతకు మించి టీఎఫ్ఎం శాతం ఉన్నవి గ్రేడ్ 1 సబ్బులు. 70 నుంచి 75 వరకు టీఎఫ్‌ఎం ఉంటే అవి గ్రేడ్ 2 సబ్బులు. 60 నుంచి 70 శాతం మధ్యలో టీఎఫ్‌ఎం ఉన్నవి గ్రేడ్ 3 సబ్బులు. గ్రేడ్ 2,3 సబ్బుల్లో ఫిల్లర్లు అధికంగా ఉంటాయి. ఇవి సబ్బు రూపంలో మామూలుగానే కనిపిస్తాయి. కాకపోతే వీటిలో శరీరానికి హాని కలిగించే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సబ్బుల్లో ఆస్బెస్టాస్ వంటి రసాయనాలు కూడా అధికంగానే ఉంటాయి. వీటిని వాడితే చర్మానికి హాని కలుగుతుంది. గ్రేడ్ 2,3 సబ్బులు నీటిలో కలిసిప్పుడు మెత్తగా అయిపోయి చాలా త్వరగా అరిగిపోతాయి. నురగ ఎక్కువ వచ్చినా వాటిని నాసిరకం సబ్బులుగానే పరిగణించాలి.

ఎలాంటి చర్మం ఉన్నవారికైనా గ్రేడ్ 1 సబ్బే మంచిది. ఎందుకంటే ఈ సబ్బులు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తాయి. దీంతోపాటు అధిక శుభ్రతను కలగజేస్తాయి. అదనపు కెమికల్స్ లేకుండానే సువాసనను ఇస్తాయి. సో, ఇక నుంచి మీరు సబ్బు కొనే ముందు దాని నురగను, సువాసనను చూసి కొనకండి. దాని ప్యాక్‌పై ఉన్న టీఎఫ్‌ఎం విలువను చూసి కొనండి. దీంతో మీ చ‌ర్మానికి ఎటువంటి హాని క‌ల‌గ‌కుండా ర‌క్షించుకోవ‌చ్చు.

Admin

Recent Posts