అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

చెవుల‌పై వెంట్రుక‌లు ఎక్కువ‌గా పెరుగుతున్నాయా ? అయితే గుండె జ‌బ్బులు వ‌స్తాయి.. సైంటిస్టుల అధ్య‌య‌నం..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధికంగా బరువు ఉండ‌డం, హైబీపీ, డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్యల కార‌ణంగా చాలా మందికి గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అయితే గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటే ఆ ల‌క్ష‌ణాల‌ను ముందుగానే క‌నిపెట్ట‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అందుకు చెవుల‌పై పెరిగే వెంట్రుక‌ల‌ను వారు ఉదాహ‌ర‌ణ‌లుగా చెబుతున్నారు.

having hair on ear may cause heart problems says scientists

పురుషుల్లో కొంద‌రికి టెస్టోస్టిరాన్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో వారి చెవుల‌పై వెంట్రుక‌లు పెరుగుతాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఇలాంటి వారికి గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో అలాంటి వారిని రెండు వ‌ర్గాలుగా విభ‌జించి వారు అధ్య‌య‌నం చేప‌ట్టారు. ఆ త‌రువాతే ఆ విష‌యం వెల్ల‌డించారు.

అయితే యుక్త వ‌య‌స్సులో చెవుల‌పై వెంట్రుక‌లు రాక‌పోయినా కొంద‌రికి వ‌య‌స్సు మీద ప‌డే కొద్దీ ఆ స్థానంలో వెంట్రుక‌లు వ‌స్తాయి. ఇక కొంద‌రికి యుక్త వ‌య‌స్సులోనే చెవుల‌పై వెంట్రుక‌లు వ‌స్తుంటాయి. అయితే దీనికి, గుండె జ‌బ్బుల‌కు ఉన్న సంబంధం తెలియ‌దు కానీ.. ఈ విధంగా ఉండ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉంటాయ‌ని మాత్రం సైంటిస్టులు చెబుతున్నారు.

అందువ‌ల్ల అలాంటి వారు ముంద‌స్తుగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మంచిద‌ని సూచిస్తున్నారు. గుండె జ‌బ్బులు అనేవి సైలెంట్ కిల్ల‌ర్ లాంటివి. అవి వ‌చ్చే వ‌ర‌కు మ‌న‌కు వాటి గురించి తెలియ‌దు. వ‌స్తే మాత్రం ప్రాణాంత‌కంగా మారుతాయి. అందువ‌ల్ల అవి రాక‌ముందే ఇలాంటి సూచ‌న‌ల ద్వారా మ‌నం వాటి గురించి తెలుసుకోవాలి. క‌నుక అలాంటి వారు ప‌రీక్ష‌లు చేయించుకుంటే మంచిది. స‌మ‌స్య లేక‌పోతే ఫర్వాలేదు. కానీ ఉంటే మాత్రం ముందుగానే తెలుస్తుంది క‌దా. దీంతో ముందుగానే జాగ్ర‌త్త ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక పైన తెలిపిన అధ్య‌య‌నం తాలూకు వివ‌రాల‌ను 1984లో ది న్యూ ఇంగ్లండ్ జ‌ర్న‌ల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్ర‌చురించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు ఆ జ‌ర్న‌ల్‌ను చ‌దివి తెలుసుకోవ‌చ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts