అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

గుండె జ‌బ్బులు ఉన్న రోగుల‌కు ఎముక‌లు త్వ‌ర‌గా విరుగుతాయ‌ట‌..?

గుండె జబ్బు రోగులకు ఎముకలు విరిగే ప్రమాదం కూడా వుందంటున్నారు పరిశోధకులు. వీరు చేసిన అధ్యయనంలో 16,294 మంది గుండె జబ్బు రోగులు 1998 – 2001 ల మధ్య పాల్గొన్నారు. వీరిలో 2000 మంది సగటు వయసు 78 సంవత్సరాలు కాగా వీరికి ఆస్పత్రి ప్రవేశ అవసరం కలిగే ఫ్రాక్చర్స్ కూడా జరిగినట్లు తెలిపారు. వీరిలో ఎముకల అరుగుదల అధికంగా వుందని వీరికి ఆస్టియోపోరోసిస్ వ్యాధికి సంబంధించిన వైద్యం కూడా చేయాలని పరిశోధకులు భావించినట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పరిశోధకులు తెలిపినట్లు దాని జర్నల్ లో ప్రచురించింది.

గుండె జబ్బుల రోగులు ఇతరులతో పోలిస్తే నాలుగు రెట్లు ఫ్రాక్చర్ రిస్కులు కలిగి వుంటారని, ప్రత్యేకించి పిరుదుల భాగాలు బలహీనపడిపోతాయని తెలిపారు. గుండె జబ్బు రోగులకు అధికంగా ఫ్రాచ్చర్స్ అవుతాయనేది తాము చేసిన మొట్టమొదటి పరిశోధన అని అధ్యయన కర్త, కెనడా లోని అల్ బర్టా యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జస్టిన్ ఎ. ఎజికోవిట్జి తెలిపారు. గుండె జబ్బు, ఆస్టియోపోరోసిస్ రెండూ కూడా వృద్ధాప్యానికి, లైంగికత్వానికి, సొగతాగటానికి, టైప్ 2 డయాబెటీస్ వ్యాధులకుండే లక్షణాలను కలిగివుంటాయని తెలిపారు.

heart patients will get osteoporosis

ఎముకలు అరిగిపోవటానికి కారణమైన మందులు ఎన్ని వాడినప్పటికి, గుండె జబ్బుల రోగులకు ఎముకలు అరిగిపోవటంలో నాలుగు రెట్లు అధిక రిస్కు వుందని, దీనికి కారణం ఎముకల నిర్వహణకు అవసరమైన కాల్షియం లేదా విటమిన్ -డిలు గుండె జబ్బు రోగులలో లోపించటమేనని ఆయన తెలిపారు.

Admin

Recent Posts