వైద్య విజ్ఞానం

షుగ‌ర్ ఉన్న‌వారు హెచ్‌బీఏ1సి త‌ప్ప‌క చేయించాలి.. ఎందుకంటే..?

ప్రారంభంలో షుగర్ వ్యాధి ఎట్టి లక్షణాలు చూపదు. అయితే నియంత్రణ లేని షుగర్ వ్యాధి ఎన్నో శారీరక సమస్యలకు కారణం కాగలదు. లక్షణాలు కనపడకుండాను, లేదా భవిష్యత్ సమస్యలు రాకుండాను వుండాలంటే షుగర్ వ్యాధిని ఎప్పటికపుడు నియంత్రిస్తూనే వుండాలి. షుగర్ కంట్రోల్ లో వుందంటే మీరు సరైనా ఆహార నియమాలను పాటిస్తున్నట్లే. కనుక నియంత్రణ చేస్తూనే వుండాలి, నియంత్రణ ఎలా చేయాలి? ప్రధానంగా షుగర్ వ్యాధిని రెండు రకాలుగా నియంత్రించవచ్చు.

ఒకటి వేలును గ్లూకో మీటర్ కు గుచ్చటం ద్వారా ఆ బ్లడ్ ను లేబరేటరీలో పరీక్షించి తెలుసుకోవచ్చు. గ్లూకోమీటర్ సాధారణంగా ఇంటిలోనే పెట్టుకొని నియంత్రణ చేయవచ్చు. ఇన్సులిన్ తీసుకునేవారికి గర్భవతులకు ఇది చాలా అనుకూలం. రెండో రకం నియంత్రణ అంటే, హెచ్ బి ఎ 1 సి పరీక్ష దీనితో పాటు మూత్రంలో షుగర్ వుందా లేదా పరీక్షించటం. ఇది సాధారణంగా వయసు మీరిన వారికి అనుకూలం.

diabetes patients must do hba1c test

యూరిన్ లో షుగర్ లేకుంటే బ్లడ్ షుగర్ 180 ఎంజి శాతం కంటే తక్కువ వుందని తెలుసుకోవాలి. షుగర్ పరీక్ష అంటే ఆసమయానికి బ్లడ్ లో షుగర్ వుందా లేదా తెలుసుకోవడమే. ఒక గంట, వారం, నెల కిందటి షుగర్ తో సంబంధం లేదు. ఇది హెమో గ్లోబిన్ కొలత కారణంగా తెలుస్తుంది. కాని ఇక హెచ్ బి ఎ1 సి పరీక్షలో మూడు లేదా నాలుగు నెలల సగటు షుగర్ రీడింగ్ చూపుతుంది. కనుక ఈ పరిక్ష వ్యయం ఎక్కువైనా ఆచరించదగింది.

Admin

Recent Posts