Heart : ఆగి పోయిన గుండెను మ‌ళ్లీ ప‌నిచేయించ‌వ‌చ్చ‌ట‌.. అలా చేస్తే చ‌నిపోయిన వాళ్లు బ‌తుకుతారు..!

Heart : ఈ సృష్టిలో ఇత‌ర జీవుల‌తో పోలిస్తే మ‌నిషికి కొన్ని ప్ర‌త్యేక ల‌క్ష‌ణాలు ఉన్నాయి. అవే మ‌నిషిని ఇత‌ర ప్రాణుల నుండి వేరు చేస్తున్నాయి. ఇత‌ర జంతువుల‌కు, వృక్షాల‌కు లేని ప్ర‌త్యేక గుణం మాన‌వులకు ఉంది. అదే ఆలోచ‌నా శ‌క్తి. మ‌నిషి త‌న మెద‌డుతో ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకుంటాడు. కానీ ఇత‌ర ప్రాణుల‌కు అలాంటి శ‌క్తి లేదు. అదే విధంగా మ‌నిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్ర‌తి అవ‌య‌వం ఆరోగ్యంగా ప‌ని చేయాలి. ఏ అవ‌యవం ప‌నిచేయ‌లేక పోయినా మ‌న ఆరోగ్యానికి ప్ర‌మాదం క‌లుగుతుంది. మ‌న శ‌రీరంలోని అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో గుండె కూడా ఒక‌టి. ఇది శ‌రీరానికి మొత్తానికి ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేస్తుంది. గుండె స‌రిగ్గా ప‌ని చేసిన‌ప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం.

ఆరోగ్య‌వంతుడి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. బీపీ ఎక్కువైతే మ‌న గుండె కొట్టుకునే వేగం ఎక్కువ‌వుతుంది. ఇలా కానీ జ‌రిగితే ప్రాణం పోయే అవ‌కాశం కూడా ఉంటుంది. గుండె ఆగిపోవ‌డం అంటే ప్రాణం పోవ‌డం అని అర్థం. ఆగిన గుండెను తిరిగి కొట్టుకునేలా చేయ‌డం బ్ర‌హ్మ దేవుని త‌రం కూడా కాదు. అది మొన్న‌టి వ‌ర‌కు అంద‌రూ న‌మ్మిన మాట‌. కానీ ఆగిన గుండెను కూడా ప‌ని చేయించ‌వ‌చ్చ‌ట‌. ఒక్క‌సారిగా కొట్టుకోవ‌డం ఆగిపోయిన గుండెను తిరిగి కొట్టుకునేలా చేస్తే ఇక ప్ర‌పంచంలో చావు అనే దానికి తావే ఉండ‌దు. ఈ ఊహే మ‌న‌కు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆగిన గుండెను తిరిగి కొట్టుకునేలా చేయ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని కొంద‌రు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

scientists say they can start a heart which is stopped
Heart

ఆగిన గుండె యొక్క కండ‌రాలను మ‌ళ్లీ క‌దిలించి ప‌ని చేయించ‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. అమెరికాలో ఓ యూనివ‌ర్సిటీకి చెందిన కొందరు ప‌రిశోధ‌కులు మ‌నిషి యొక్క ఆగిన గుండెను తిరిగి ప‌నిచేయించ‌డంపై తీవ్రంగా ప‌రిశోధ‌నలు చేస్తున్నార‌ట‌. దీనికోసం ప్రాంక‌న్ స్టైన్ అనే టెక్నాల‌జినీ త‌యారు చేస్తున్నార‌ట‌. ఈ ప‌రిశోధ‌న బృందానికి భార‌త సంత‌తికి చెందిన ఒక‌రు సారథ్యం వ‌హిస్తున్నార‌ట‌. గుండె కండ‌రాల‌లో క‌దలిక‌లు తీసుకు రావ‌డం వ‌ల్ల గుండెను ప‌ని చేయించ‌వ‌చ్చ‌ని ఈ ప‌రిశోధ‌కులు గ‌ట్టిగా చెబుతున్నారు. వారు అనుస‌రిస్తున్న ప్రాంకెన్ స్టైన్ టెక్నాల‌జీ ద్వారా గుండెకి ఎక్స్ ట్రా సెల్యులార్ మాట్రిక్స్ అనే పొడిని పంప‌డం ద్వారా గుండె కండ‌రాల‌ను ప‌నిచేయించ‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.

ఈ పొడి కండ‌రాల్లో ఉండే ప్రోటీన్ల‌ను, కండ‌రాల‌ను వేరు చేస్తుంద‌ట‌. ఈ వైద్య విధానాన్ని ఎండోపాట్రియ‌ల్ మాట్రిక్స్ థెర‌పీ అని అంటారు. ఈ థెర‌పీ చాలా త‌క్కువ ఖ‌ర్చుతో కూడుకున్న‌ద‌ని, అలాగే ఇది చాలా సుల‌భ‌మైన‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. ఈ విధానం వ‌ల్ల గుండెలోని మృత‌కండ‌రాల‌కు తిరిగి జీవం పోయ‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఇది ఇంకా పరిశోధ‌న ద‌శ‌లోనే ఉంద‌ని ఈ ప‌రిశోధ‌న క‌నుక విజ‌య‌మంత‌మైతే మాన‌వాళికి ఇది శుభ‌వార్తేన‌ని వారు అంటున్నారు. ఈ టెక్నాల‌జీని త్వ‌ర‌గా రూపొందించ‌గ‌లిగితే మాన‌వాళికి చావు అనేది రానే రాదు.

Share
D

Recent Posts