sports

చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లు..

టెస్ట్ సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్‌ని కూడా క్లీన్‌స్వీప్ చేసింది. హైదరాబాద్ వేదికగా శనివారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 133 పరుగుల తేడాతో విజయం సాధించింది భార‌త జ‌ట్టు. మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో చేజిక్కించుకుంది. ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌ను కూడా భారత్ జట్టు 2-0తో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌తో భారత్ గడ్డపై బంగ్లాదేశ్ పర్యటన ముగిసింది.హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం‌ రికార్డులకు వేదిక అయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 297 పరుగులు చేయడమే కాదు.. టీ20ల్లో పలు రికార్డులను సొంతం చేసుకుంది.

బంగ్లాదేశ్‌పై 297 పరుగులే టీ20 క్రికెట్‌లో అత్యధిక జట్టు స్కోర్. అలాగే టీమిండియాకే ఇదే అత్యధిక స్కోర్ కూడా. అంతకముందు 2017లో శ్రీలంకపై టీమిండియా 260 పరుగులు చేయగా.. అదే సమయంలో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 250 పరుగుల మార్కును దాటడం ఇది మూడోసారి.ఈ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ బ్యాటర్లు కలిపి ఏకంగా 71 బౌండరీలు నమోదు చేశారు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు టీ20ల్లో 200 ప్లస్ స్కోరు చేసిన టీమ్‌గా భారత్ నిలిచింది. టీమిండియా ఏడో సారి 200 ప్లస్ స్కోరు చేయ‌డం విశేషం. ఈ మ్యాచ్‌లో మొత్తం 461 పరుగులు నమోదు కాగా, .. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు నమోదైన రెండో మ్యాచ్ గా దీనిని ప‌రిగణించ‌వ‌చ్చు. తొలి స్థానంలో 472 పరుగులతో అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ టీమ్ మ్యాచ్ ఉంది.

team india creates history these are the records

ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన రికార్డ్‌ నేపాల్ టీమ్ పేరిట ఉంది. ఆ జట్టు 2023లో మంగోలియాపై 314 పరుగులు చేసింది.అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ టీం సెంచరీ రికార్డును భారత జట్టు సొంతం చేసుకుంది. కేవలం 7.1 ఓవర్లలోనే టీమ్ ఇండియా 100 పరుగుల మార్కును అధిగమించి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.అలాగే 10 ఓవర్లలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా కూడా టీమిండియా రికార్డు సృష్టించింది. సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్‌లు 10 ఓవర్లలో భారత్ స్కోరు బోర్డుపై 150 పరుగుల మార్క్ దాటించారు.అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా భారత జట్టు రికార్డు సృష్టించింది. బంగ్లాదేశ్‌పై భారత బ్యాట్స్‌మెన్లు మొత్తం 22 సిక్సర్లు కొట్టారు. ఇది సరికొత్త ప్రపంచ రికార్డు. అలాగే, ఈ మ్యాచ్‌లో 25 ఫోర్లు బాదారు.

Share
Sam

Recent Posts