ఎస్.డి కార్డ్ మీద ఉండే U1, U3, HC సింబల్స్ యొక్క అర్థం ఏంటో మీకు తెలుసా.. కొన్నేళ్ల క్రితం మీరు కూడా 3జీ ఇంటర్నెట్ వాడినట్లయితే మీరు కూడా ఈ ఎస్. డి కార్డు లను వాడే ఉంటారు. వాటి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎస్. డి కార్డు అంటే సెక్యూర్ డిజిటల్ కార్డ్. ఎస్. డి కార్డు మీద ఉండే ఈ సింబల్స్, నెంబర్స్ దాని క్వాలిటీని, స్పెషల్ ఫీచర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. మెమొరీ కార్డులు మూడు రకాలుగా ఉంటాయి.
1.మొదటిది చాలా సింపుల్ ఎస్ డి కార్డ్. ఇది చాలా పాతది. అందుకే దీన్ని ఇప్పుడు తక్కువ గా వాడుతున్నారు. ఎందుకంటే దీని మ్యాగ్జిమమ్ కెపాసిటీ 2GB నే ఉంటుంది.
2.ఇక రెండోది ఎస్.డి.హెచ్.సి కార్డ్. దీని ఫుల్ ఫామ్ సెక్యూర్ డిజిటల్ హై కెపాసిటీ కార్డు. దీని మీద ఉన్న హెచ్.సి సింబల్ ఈ ఫీచర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ కార్డు మ్యాగ్జిమమ్ కెపాసిటీ 32GB.
3.ఇక మూడోది ఎస్.డి. ఎక్స్. సి కార్డు. దీన్ని ఫుల్ ఫామ్ సెక్యూర్ డిజిటల్ ఎక్స్టెండెడ్ కెపాసిటీ. దీని కెపాసిటీ 2TB వరకు ఉంటుంది. అలాగే ఈ U సింబల్ అల్ట్రా హై స్పీడ్ ను రిప్రజెంట్ చేస్తుంది. U1 అని ఉంటే దీని స్పీడ్ 10mbps వరకు ఉంటుంది.U3 అని ఉంటే దీని మాక్సిమమ్ స్పీడ్ 30mbps అని అర్థం.