vastu

చీపురు విష‌యంలో ఈ ఒక్క త‌ప్పు చేస్తే మీకు న‌ష్టాలే వ‌స్తాయి..!

శుభ్రత చాలా ముఖ్యం. ఎక్కడ శుభ్రంగా ఉంటే అక్కడ లక్ష్మీ దేవి ఉంటుంది అని అంటూ ఉంటారు. రోజు మనం ఇల్లుని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అయితే రాత్రి పూట మాత్రం చీపురు తో ఇల్లు తుడవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యోదయం అయ్యే వరకు ఎప్పుడైనా ఇల్లుని తుడవచ్చని అంటున్నారు. మరీ ముఖ్యంగా లేవగానే ఇంటిని తుడుచుకోవడం మంచిది. అయితే సూర్యాస్తమయం అయిన తర్వాత చీపురు తో ఇల్లు తుడవడం మంచిది కాదు అని చెప్తున్నారు.

do not make this mistake with broom at night

సంధ్య వేళ అయినా రాత్రి అయినా సరే చీపురుని ఇంట్లో ఉపయోగించకూడదు అని చెప్తున్నారు పండితులు. అయితే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అనే విషయానికి వస్తే… ఎక్కడ అయితే రాత్రి పూట చీపురుని ఉపయోగించి తుడుస్తారో ఆ ఇంట లక్ష్మీ దేవి ఉండదని అంటారు.

అంతే కాదు ఆ ఇళ్ళల్లో ఉండే వాళ్లు సమస్యలకు గురవుతారని ముఖ్యంగా సంతోషానికి సంబంధించిన సమస్యలు వస్తాయని, శాంతి ఉండదని, ఆరోగ్యం సరిగ్గా ఉండదని పండితులు చెబుతున్నారు. ఒకవేళ మీరు పురాతన పద్ధతిని చూస్తే మీకు దీని కోసం అర్థమవుతుంది. అలానే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చీపురుని అడ్డంగా పడేయడం చేయకూడదు మరియు చీపురుతో కొట్టడం లాంటివి కూడా చేయడం మంచిది కాదు.

Admin

Recent Posts