vastu

పూర్వీకుల ఫోటోలను ఈ విధంగా పెడుతున్నారా.. అయితే సమస్యలు తప్పవు!

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇండ్లలో వారి పూర్వీకుల ఫోటోలను పెట్టుకొని ఉంటారు. వారి చనిపోయిన కూడా వారి ఆశీస్సులు మనకు ఉండాలని వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఫోటోల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం ప్రకారం మరణించిన వారి ఫోటోలను గోడకు వేలాడ తీయకూడదు. వారి ఫోటోలను ఎల్లప్పుడు ఏదైనా చెక్క బల్ల పై పెట్టుకోవాలి. అదేవిధంగా మరణించిన వారి ఫోటోలను ఎప్పుడూ కూడా దేవుడి గదిలో పెట్టి పూజ చేయకూడదు. ఈ విధంగా దేవుని గదిలో పెట్టి పూజ చేయటం వల్ల ఇంట్లో కలహాలకి కారణమవుతాయి.

if you are putting elders photos like this then you will get problems

చాలామంది మరణించిన వారి ఫోటోల పక్కనే బ్రతికున్న వారి ఫోటోలను కూడా పెడతారు. ఈ విధంగా చేయడం వల్ల బ్రతికున్న వారికి ఆయుష్షు తగ్గుతుంది. అదేవిధంగా చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లోకి రాగానే కనిపించేటట్టు పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. చనిపోయిన వారి ఫోటోలను హాలులో ఉత్తరం దిక్కున పెట్టడం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

Admin

Recent Posts