ప్రపంచ ఆరోగ్య సంస్థచే వంద శాతం రేటింగ్ పొందిన ఏకైక ఆహారం.. సమృద్ధిగా పోషకాలను, ఖనిజాలను అన్ని రకాల ప్రొటీనులు కలిగి రోగ నిరోధకత మరియు బలవర్ధకమైనదిగా ఏకగ్రీవంగా సిఫారసు చేసినది.. ఒకే ఒక్క ఆహారము తల్లిపాలు. తల్లిపాలు సృష్టిలో క్షీరద జాతికి చెందిన ప్రతి జీవి తన బిడ్డ జన్మించగానే ఇచ్చే మొదటి ఆహారం. తల్లి పాలు – ఎడమ పక్క గ్లాసు లోది నిండుగా ఉన్న వక్షం తొట్టతొలిగా వచ్చే పాలు, కుడి వైపు దాని లోది దాదాపుగా ఖాళీ అయిన వక్షం నుండి వచ్చే చివరి పాలు. మొదటి దానిలో నీరు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండి, దాహం తీరుస్తుంది. రెండవ దానిలో నీరు తక్కువగా, కొవ్వు ఎక్కువగా ఉండి, ఆకలి తీరుస్తుంది.
ప్రపంచపు భిన్న వాతావరణాలలో వందశాతంగా రేటింగ్ పొందింది తల్లి పాలను మించింది ఏదియును లేదు. మనకు లభించే వేలాది రకరకాల శాకములు, మాంసాల లో ఉదాహరణలుగా కొన్ని బాదాం, పుచ్చ కాయ పలుకు లాంటి ఎండు ఫలాలు, చిలగడదుంప ,అరటి, ఆరంజ్ లాంటి పళ్లు , బఠాణి, బ్రకోలీ, బీన్స్, కాయగూరలు, కొత్తిమీర, మెంతికూర, పాలకూర ఆకుకూరలు , చేపలు, మాంసాహారాలు , మిరియాలు, మిరపకాయ లాంటి సుగంధ ద్రవ్యాలు మొదలగు నవి మంచి రేటింగ్‌ల పదార్థాలు. మనం వండుకుని తయారు చేసుకునే తగిన ఆహార పదార్థాలు.
లోకో భిన్న రుచి అని నానుడి ఐనను ఎన్నో ఆహార సంస్థల సేకరణలు, నివేదిక ల ప్రకారంగా ప్రపంచములోని వేల రకాల వంటకాల మేళవింపులతో ఇట్టే కలిసి పోయి రుచిగా తినగలిగేది ఒక్క అన్నము తోనేనని ఒక అంతర్జాతీయ పత్రికలో ప్రచురించారు. ప్రతి ఒక వండిన/వండని సూప్, పచ్ఛడి, కూరలు , పొడులు చారులు,కాల్చిన, వేపుడులు , వెన్న, నెయ్యి, పాలు , పెరుగు లాంటి రక రకాల వంటకాలతో కలుపుకునే తినేది/తినగల్గేది ఒకే ఒక ప్రపంచపు ఆహారము అన్నమే అని పాతిక సంవత్సరాల క్రితమే చెప్పారు. అన్నము మన తెలుగు వారి ఆరోగ్యానికి వంద శాతం రేటింగ్ పొంద గల ఏకైక ఆహారం అని చెప్పవచ్చు. కానీ ఏదైనా తల్లి పాల తరువాతే.