vastu

Seeing In Mirror : పొద్దున్న లేవగానే మీ ముఖం మీరు అద్దంలో చూసుకుంటున్నారా..? అలా చేయడం మంచిదేనా..?

Seeing In Mirror : చాలామందికి నిద్రలేవగానే పర్టిక్యులర్ గా దేన్నైనా చూసే అలవాటుంటుంది. అది దేవుడి ఫొటోకావొచ్చు, చేతికి ఉన్న ఉంగరం కావొచ్చు లేదా తమకు నచ్చిన వారి ముఖం చూడడమో చేస్తుంటారు. మరికొంతమందికి పొద్దున్న లేవగానే తమ ముఖం తామే చూసుకునే అలవాటుంటుంది. కానీ అలా చేస్తే దరిద్రం అని శాస్త్రం చెబుతోంది. పొద్దున్న లేవగానే చేయకూడని పనులు ఏంటో చూడండి. పొద్దున్న లేవగానే సరాసరి అద్దం ముందుకు వెళ్లి తలదువ్వుకుని తీరిగ్గా అప్పుడు పనులు ప్రారంభించే అలవాటు మంచిది కాదు. దీనివల్ల దరిద్రమే చుట్టుకుంటుంది.

ఉదయం లేవగానే పళ్లు తోముకోకుండా కాఫీ, టీలు తాగుతున్నారా. దీనివల్ల అనారోగ్యమే కాదు భవిష్యత్ లో మీకు అన్నం దొరకకుండా పోతుంది. చాలా మందికి బ్రష్ చేసేప్పుడు అటు ఇటు తిరగడం అలవాటు. అది మంచి పద్దతి కాదు. మనం బ్రష్ చేసేప్పుడు ఎవరూ చూడకుండా ఉండడం మంచిది.

is seeing in mirror after wakeup is good or what

దాంతోపాటు పొద్దుటి ఎండ మంచిదని, టైం లేదనే సాకుతో చాలామంది బ్రష్ చేసేప్పుడు సూర్యుని చూస్తూ తోముతారు. దానివల్ల సూర్యుని ఆగ్రహం పొందడం ఖాయం. దీనివల్ల అనారోగ్యం, అనారోగ్యం వల్ల డబ్బులు ఖర్చు.. దరిద్రం కలుగుతాయి. కాబట్టి పొద్దున్న లేవగానే ఈ పనులు చేయకండి.

Admin

Recent Posts