Copper Surya : చాలా మంది, వాస్తు చిట్కాలు ని పాటిస్తూ ఉంటారు. పండితులు చెప్పే వాస్తు చిట్కాలు ని పాటిస్తే, అంతా మంచి జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. పైగా, వీటి వలన ఏ విషయాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది తెలుస్తుంది. వాస్తు ప్రకారం, ఇలా చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట. రాగి సూర్యుడిని ఇంట్లో పెట్టుకుంటే, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దుష్టశక్తులను తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రాగితో చేసిన లోహ సూర్యుడని ఇంట్లో పెట్టుకుంటే, అదృష్టం కలిసి వస్తుంది. చాలా సమస్యలు తగ్గిపోతాయి.
రాగి సూర్యుడిని ఇంట్లో ఉండే గోడలపై సరైన దిశలో పెడితే చక్కటి ఉపయోగం ఉంటుంది. వాస్తు ప్రకారం, రాగితో చేసిన సూర్యుడిని ఇంట్లో పెట్టడం వలన, గౌరవం లభిస్తుంది. ఆఫీసులో కూడా పెట్టుకోవచ్చు. రాగి సూర్యుడు వలన కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. రాగి సూర్యుడికి బలమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. పైగా, రాగి సూర్యుడు ఇంట్లో ఉండడం వలన, పేరు ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి.
వ్యాపారవేత్తలు, ప్రభుత్వాధికారులు లేదంటే కళాత్మక రంగానికి చెందిన వాళ్ళు, ఇంట్లో రాగి సూర్యుడిని తప్పక పెట్టండి. ఇంట్లో కిటికీ లేదా తూర్పు దిశలోని ఏదైనా మార్గంలో తూర్పు గోడపై పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే, సమస్యలన్నిటికీ దూరంగా ఉండవచ్చు.
ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉంటే, తలుపు వెలుపుల రాగి సూర్యుడిని పెడితే, ఇంట్లో సంపద పెరుగుతుంది. ఇలా, రాగి సూర్యుడిని ఇంట్లో ఈ దిశలో ఇక్కడ చెప్పినట్లు మీరు పెట్టినట్లయితే, చక్కటి ఫలితం ఉంటుంది. రాగి సూర్యుడును ఇంట్లో పెట్టుకోవడం వలన అనేక మార్పులు కలుగుతాయి. కావాలంటే, ఈసారి ఈ విధంగా ప్రయత్నం చేసి చూడండి. మార్పులు మీరే గమనిస్తారు.