వినోదం

న‌య‌న‌తార ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టడం ఖాయం..!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగు, తమిళ భాష‌ల‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. స్ట్రాంగ్ ఉమ‌న్‌గా, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌కి సరైన అర్థంగా నిలిచిన న‌య‌న‌తార హీరోల‌కు దీటుగా అశేష అభిమాన గ‌ణాన్ని సంపాదించుకుంది. కెరీర్ ప‌రంగా సాఫీగా సాగుతున్నా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం చాలా డిస్ట్ర‌బెన్స్ ఉన్నాయి. శింబు, ప్ర‌భుదేవా త‌ర్వాత విగ్నేష్ శివ‌న్ ప్రేమ‌లో ప‌డ్డ ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల అత‌నిని పెళ్లి చేసుకుంది. అనంతరం వెంటనే షూటింగ్‌లో పాల్గొంది నయనతార. షూటింగ్‌ గ్యాప్‌లో హనీమూన్‌ కూడా చేసుకుంది. మళ్లీ ఇప్పుడు కమిట్‌ అయిన సినిమాలతో బిజీగా ఉంది.

కొన్నేళ్లుగా సినిమాలు చేస్తూ వ‌స్తున్న న‌య‌న‌తార ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని ఆస్తులు కూడబెట్టింద‌నే విష‌యం ఇప్పుడు అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నయనతార తన సొంతంగా సంపాదించిన ఆస్తులే ఏకంగా రూ.165 కోట్లు ఉంటాయని సమాచారం. ఆదాయపన్ను శాఖకి నయనతార సమర్పించిన పత్రాల్లో ఈ మొత్తం ఆస్తుల వివరాలు తెలిపినట్టు సమాచారం. సినిమాల‌తోపాటు ప‌లు వాణిజ్య సంస్థ‌ల యాడ్‌ల‌లోనూ న‌టిస్తున్న న‌య‌న‌తార బాగానే కూడ‌బెట్టింద‌ట‌. న‌య‌న‌తార‌కు హైదరాబాద్ లో రెండు ఖరీదైన బంగ్లాలు, చెన్నైలో అధునాతర వసతులతో కూడిన నాలుగు ప్లాట్లు, కేరళలోని తన తల్లిదండ్రులు నిర్వహిస్తున్న ఇల్లు.. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సొంత ఇళ్ల‌ను ఏర్పాటు చేసుకున్న‌ట్టు తెలుస్తుంది.

nayanthara net worth and properties value

నయనతారకి ఒక లిప్‌బామ్‌ కంపెనీ కూడా ఉంది. తన స్నేహితురాలు వనిత రాజన్‌తో కలిసి ఈ కంపెనీని ప్రారంభించింది. మరోవైపు నిర్మాతగానూ రాణిస్తుంది నయనతార‌. ఇలా మున్ముందు మరిన్ని వ్యాపారాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తుందట లేడీ సూపర్‌ స్టార్‌. ఇక ఇటీవ‌ల 20 కోట్ల విలువ గ‌ల జెట్ విమానం కొనుగోలు చేసింది. దానితో పాటు ఖ‌రీదైన కార్లు కూడా ఈ అమ్మ‌డు సొంతం చేసుకుంది. మొత్తానికి న‌య‌న ఆస్తుల చిట్టా చాలా పెద్ద‌ద‌నే చెప్పాలి. నయనతార తెలుగులో గాడ్‌ ఫాదర్ లో చిరంజీవికి చెల్లిగా నటించింది. సైరాలో ఆమె చిరుకి జోడీగా నటించిన విషయం తెలిసిందే. మరోవైపు హిందీలో జవాన్ తోపాటు తమిళంలో కనెక్ట్, ఇరైవన్‌, మలయాళంలో గోల్డ్ చిత్రాల‌లో న‌టించింది.

Admin

Recent Posts