vastu

Mirror In Home : ఇంట్లో అద్దాన్ని ఈ దిక్కున పెట్టండి.. ల‌క్ష్మీ దేవి ఆశీస్సులు ల‌భిస్తాయి.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది..!

Mirror In Home : ప్ర‌తి ఒక్క‌రు వారి కుటుంబం ఆనందంగా, సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటారు. అందుకోసం ఎంతో ప్ర‌య‌త్నం చేస్తూ ఉంటారు. ఎంతో క‌ష్ట‌ప‌డ‌తారు. కానీ మ‌నం చేసే కొన్ని చిన్న చిన్న త‌ప్పులే మ‌న ఇంట్లో ఆనందం, సంతోషం లేకుండా చేస్తుంది. అవి త‌ప్పులు అన్న విష‌యం కూడా మ‌న‌కు తెలియ‌దు. కానీ ఈ త‌ప్పులే మ‌నం ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హాన్ని కోల్పోయేలా చేస్తాయి. మ‌నం క‌ష్టాల‌కు గురి అయ్యేలా చేస్తాయి. మ‌నం విస్మ‌రిస్తున్న ఈ చిన్న త‌ప్పులు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న ఇండ్ల‌ల్లో సాధార‌ణంగా అలంక‌ర‌ణ చేసుకోవ‌డానికి ముఖం చూసుకోవ‌డానికి అద్దం ఉంటుంది. మ‌న ఇంట్లో ఉండే ఈ అద్దాన్ని రోజూ శుభ్రం చేసుకోవాలి. దీనిపై దుమ్ము పేరుకుపోకుండా చూసుకోవాలి. అద్దంపై దుమ్ము ప‌డితే మ‌న శ్రేయ‌స్సుపై దుమ్ము ప‌డుతుంది. క‌నుక మీకు, కుటుంబ స‌భ్య‌ల శ్రేయ‌స్సుకు ఆటంకం క‌ల‌గ‌కుండా ఉండాలంటే అద్దాన్ని రోజూ శుభ్రం చేసుకోవాలి.

అలాగే ఇంటి ద‌క్షిణ గోడపై అద్దాన్ని పెట్ట‌వ‌ద్దు. ఇలా ఉంచ‌డం వ‌ల్ల ఆర్థిక స‌మస్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అద్దాన్ని ఎల్ల‌ప్పుడూ ఈశాన్య దిశ‌లో మాత్ర‌మే ఉంచాలి. అలాగే ప‌గిలిన విరిగిన అద్దాల‌ను ఇంట్లో ఉంచ‌కూడ‌దు. అద్దం ప‌గ‌ల‌డం ఆర్థిక న‌ష్టానికి సంకేతం. క‌నుక మ‌న ఇండ్ల‌ల్లో ఉండే అద్దాన్ని చాలా జాగ్రత్త‌గా చూసుకోవాలి. అలాగే ఇంట్లో బూజు లేకుండా చూసుకోవాలి. బూజు ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుంది. ఇది మ‌న శ్రేయ‌స్సుకు కూడా ఆటంకం క‌లిగిస్తుంది. క‌నుక ఇంటిని, కిటికీలు, త‌లుపులను బూజు లేకుండా ఎప్పుడూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఇంటి యొక్క వాస్తు ఇంట్లో నివ‌సించే వారిపై చాలా ప్ర‌భావాన్ని చూపిస్తుంది. ఇది మ‌న వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని కూడా ప్ర‌భావితం చేస్తుంది. క‌నుక ఇంట్లో వీలైనంత సానుకూల శ‌క్తి ఉండ‌డం చాలా అవ‌స‌రం. దీని కోసం ఇంట్లో ఉద‌యం మ‌రియు సాయంత్రం శంఖం ఊద‌డం మంచిది. దీంతో ఇంట్లో ఉండే ప్ర‌తికూల శ‌క్తులు పోయి ఇంట్లో సానుకూల‌త ఏర్ప‌డుతుంది.

put mirror in home like this for wealth

అలాగే చాలా మంది హిందువులు ఇంట్లో గంగాజ‌లాన్ని ఉంచుకుంటారు. ఈ గంగాజ‌లాన్ని ఇంట్లో ఈశాన్య మూల‌లోనే ఉంచాలి. ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఉంచ‌కూడ‌దు. అలాగే ఈ గంగాజ‌లాన్ని ప్లాస్టిక్ బాటిల్ లో కాకుండా గాజు సీసాలోనే ఉంచాలి. పూజ చేసిన త‌రువాత ఇంటి గుమ్మం నుండి వంట‌గ‌ది వ‌ర‌కు కొన్ని చుక్క‌ల గంగాజలాన్ని చ‌ల్లండి. సాయంత్రం పూట తుల‌సి కోట దీపం వెలిగించండి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల మ‌న కుటుంబంలో ఎప్పుడూ సంతోషాలు, ఆనందాలు నెల‌కొంటాయ‌ని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts