Bamboo Plant : చాలా మంది తమ తమ ఇండ్లలో తులసి, బాంబూ, మనీ ప్లాంట్, అపరాజిత వంటి మొక్కలను పెంచుకుంటారు. వీటి వల్ల ఇంట్లోని వారికి ఆరోగ్యం కలుగుతుందని, ధనం నిలుస్తుందని వారి నమ్మకం. అయితే అంత వరకు ఓకే. కానీ బాంబూ మొక్క విషయానికి వస్తే మాత్రం దాన్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో పెట్టుకుంటేనే తద్వారా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందట. దీంతో అంతా శుభమే కలుగుతుందట. మరి బాంబూ మొక్కను ఇంట్లో ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా.
ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారమైతే బాంబూ మొక్కలను భూమి, నీరు, అగ్ని, లోహం అనే అంశాలు ప్రతిబింబించే విధంగా పెట్టుకోవాలట. దాంతో ఆ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసారమై వారందరికీ మంచే జరుగుతుందట. అనుకున్నవి నెరవేరుతాయట. అయితే అలా ఆయా అంశాలను ప్రతిబింబించేలా మొక్కను పెట్టాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
బాంబూ మొక్కను ఓ చిన్న కంటెయినర్‌లో ఉంచి అందులో 2-3 ఇంచుల లోతులోనే నీటిని పోయాలి. దీంతో నీరు అనే అంశం ప్రతిబింబిస్తుంది. ఆ నీటిలో ఏదైనా ఓ నాణేన్ని వేయాలి. దీంతో లోహం అంశం పూర్తవుతుంది. అదే నీటిలో రాళ్లను వేస్తే అది భూమిని ప్రతిబింబిస్తుంది. ఇక ఆ మొక్క అగ్నిని ప్రతిబింబించాలంటే దాని చుట్టూ ఎరుపు రంగు దారం కట్టాలి. దీంతో ముందు చెప్పిన నాలుగు అంశాలు ప్రతిబింబిస్తాయి.
అనంతరం మొక్కలో బేసి సంఖ్యలో కాండాలు ఉండేలా చూసుకోవాలి. అలా సరి చేశాక ఆ మొక్కను సూర్య రశ్మి తగలని ప్రదేశంలో ఉంచాలి. నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. దీంతో మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందరికీ లక్ కలసి వస్తుంది. ఏం చేసినా సరే తప్పక విజయం సాధిస్తారు.