viral news

గోవాలో బోట్ మునిగిపోయిందన్న వార్తలో నిజం ఎంత..? అసలేం జరిగిందంటే..?

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు నకిలీ వార్తలు వస్తూ ఉంటాయి. నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒక ఓడ మునిగిపోయిందని పాసింజర్లు నీళ్లలో కొట్టుకుపోయారని.. గోవాలో ఇది చోటు చేసుకుందని వార్త విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అనేది చూసేద్దాం.

వీడియోలో 23 మంది చనిపోయారని, 64 మంది కనబడట్లేదని ప్రచారం జరుగుతోంది. గోవా పోలీసులు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఎక్స్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఫేక్ అని చెప్పారు. అయితే, ఇది గోవాలో చోటు చేసుకోలేదని.. గోమా కాంగో ఆఫ్రికాలో జరిగినదని.. ఇలాంటి వార్తలు షేర్ చేసే ముందు నిజం ఏంటో తెలుసుకోవాలని సూచించారు.

fact check goa boat accident is it true or fake

అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తలని ఇతరులకి స్ప్రెడ్ చేయద్దు అని చెప్పారు. ఎక్కువమంది బోట్లో వెళ్లడం వలన ఈ ప్రమాదం జరిగిందని.. లైఫ్ జాకెట్లు కూడా తక్కువగా ఉన్నాయని.. ఎక్కువ మంది బోట్ ఎక్కడం వల్లే మునిగిపోయిందని తెలుస్తోంది.

Peddinti Sravya

Recent Posts