business ideas

LIC Agent Income : LIC లో ఏజెంట్‌గా ఉంటే ఎంత సంపాదించ‌వ‌చ్చు..? లెక్క‌లు చెప్పిన కంపెనీ..!

LIC Agent Income : Life Insurance Corporation (LIC) లో చాలా మంది ఏజెంట్లుగా ప‌నిచేస్తున్నార‌న్న సంగ‌తి తెలిసిందే. LIC లో ఎవ‌రైనా స‌రే పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్ ఏజెంట్‌గా ప‌నిచేయ‌వ‌చ్చు. ఎక్కువ పాల‌సీల‌ను క‌స్ట‌మ‌ర్ల‌తో కొనిపిస్తే దాన్ని బ‌ట్టి ఇన్సెంటివ్‌లు, జీత భ‌త్యాలు ఉంటాయి. అయితే ఒక LIC ఏజెంట్ యావ‌రేజ్‌గా నెల‌కు ఎంత సంపాదించ‌వ‌చ్చు..? అనే వివ‌రాల‌ను LIC తాజాగా వెల్ల‌డించింది. ఈ వివ‌రాల‌ను LIC సంస్థ తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ‌కు అంద‌జేసింది. ఆ వివ‌రాల‌ను ఇప్పుడు చూద్దాం.

దేశ‌వ్యాప్తంగా LIC లో 13,90,920 మంది ఏజెంట్లుగా ప‌నిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనే ఉండ‌డం విశేషం. ఈ రాష్ట్రంలో మొత్తం 1.84 ల‌క్ష‌ల LIC ఏజెంట్లు ప‌నిచేస్తున్నారు. వీరు నెల‌కు యావ‌రేజ్‌గా రూ.11,887 సంపాదిస్తున్నారు. అలాగే ఈ జాబితాలో మ‌హారాష్ట్ర 2వ స్థానంలో ఉంది. ఇక్క‌డ 1.61 ల‌క్ష‌ల మంది LIC ఏజెంట్లు ప‌నిచేస్తున్నారు. వీరు యావ‌రేజ్‌గా నెల‌కు రూ.14,931 సంపాదిస్తున్నారు. అలాగే 3వ స్థానంలో ప‌శ్చిమ బెంగాల్ ఉంది.

LIC Agent Income how much one can earn with that

ప‌శ్చిమ బెంగాల్‌లో..

ప‌శ్చిమ బెంగాల్‌లో మొత్తం 1,19,975 LIC ఏజెంట్లు ప‌నిచేస్తున్నారు. వీరు నెల‌కు యావ‌రేజ్‌గా రూ.13,512 సంపాదిస్తున్నారు. త‌రువాతి స్థానంలో త‌మిళ‌నాడు ఉంది. ఈ రాష్ట్రంలో 87,347 LIC ఏజెంట్లు విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. వీరు నెల‌కు స‌రాస‌రిగా రూ.13,444 సంపాదిస్తున్నారు. త‌రువాత క‌ర్ణాట‌క‌లో 81,674 మంది LIC ఏజెంట్లు ఉండ‌గా, వీరు నెల‌కు యావ‌రేజ్‌గా రూ.13,265 సంపాదిస్తున్నారు.

ఇక త‌రువాతి స్థానంలో రాజ‌స్థాన్ ఉంది. ఇక్క‌డ 75,310 మంది LIC ఏజెంట్లు ఉన్నారు. వీరు నెల‌కు స‌రాస‌రిగా రూ.13,960 సంపాదిస్తున్నారు. త‌రువాత మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 63,779 మంది LIC ఏజెంట్లు ఉన్నారు. వీరు నెల‌కు స‌రాస‌రిగా రూ.11,647 సంపాదిస్తున్నారు. ఆ త‌రువాత ఢిల్లీలో 40,469 మంది LIC ఏజెంట్లు ఉండ‌గా వీరు నెల‌కు యావ‌రేజ్‌గా రూ.15,169 సంపాదిస్తున్నారు. అయితే నెల‌వారీ సంపాద‌న‌ను బ‌ట్టి చూస్తే ఆ జాబితాలో అండ‌మాన్ నికోబార్ దీవులు మొద‌టి స్థానంలో ఉన్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

అండ‌మాన్ నికోబార్ దీవుల్లో ఎక్కువ సంపాద‌న‌..

అండ‌మాన్ నికోబార్ దీవుల్లో LIC ఏజెంట్లు కేవ‌లం 273 మాత్ర‌మే. కానీ వీరు నెల‌కు దేశంలోనే అత్య‌ధికంగా యావ‌రేజ్‌గా రూ.20,446 సంపాదిస్తున్నారు. ఇక హిమాచ‌ల్ ప్ర‌దేశ్లో 12,731 మంది LIC ఏజెంట్లు ఉండ‌గా వీరు దేశంలోనే అత్యంత త‌క్కువ‌గా నెల‌కు యావ‌రేజ్‌గా రూ.10,328 సంపాదిస్తున్నారు. అయితే LIC లో యాక్టివ్‌గా ఉంటూ ఫుల్ టైం ఏజెంట్‌గా ప‌నిచేస్తే ఇంకా ఎక్కువ‌గానే సంపాదించుకోవ‌చ్చు. కానీ అందుకు చాలా వాగ్దాటి ఉండాలి. క‌స్ట‌మ‌ర్‌తో మాట్లాడిన త‌రువాత అత‌ను క‌చ్చితంగా పాల‌సీ తీసుకునేలా చేయాలి. ఈ స్కిల్స్ ఉంటే చాలు, LIC లో ఏజెంట్‌గా చేరి ఎవ‌రైనా స‌రే ఎంతైనా సంపాదించుకోవ‌చ్చు. దీన్ని పార్ట్ టైమ్‌గా కాకుండా ఫుల్ టైమ్ ఇన్‌క‌మ్‌గా కూడా చూడ‌వ‌చ్చు.

Admin

Recent Posts