Deeparadhana : పూజలో దీపారాధన అతిముఖ్యమైంది. దీపం లేని ఇల్లు అదృష్టాన్ని ప్రసాదించదు. దీపం వెలిగించడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. అందులో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే శుభదాయకం. ఆవు నేతితో ఎలా దీపం వెలిగించాలంటే.. ముందుగా దీపారాధన చేసే కుందులను శుభ్రం చేసి.. కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తర్వాత ఆవు నెయ్యిని పోసి దానిలో వత్తులు వేసుకోవాలి. కేవలం అగరవత్తులతోనే దీపాన్ని ముట్టించాలి.
అగ్గిపుల్లలతో దీపారాధన చేయకూడదు. ముట్టించిన దీపంతో ఇంకొక దీపం వెలిగించకూడదు. సాయంత్రం పూట లేదా ఉదయం పూట ఆవు నేతితో దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు వుండవు. చేతికందాల్సిన డబ్బు అందుతుంది. నేతి దీపాన్ని ఇంట వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తీరిపోతాయి.
లక్ష్మీదేవికి నేతి ప్రీతిదాయకం కావడంతో.. ఆమెను స్తుతించి ఈ దీపారాధన చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే సరస్వతీ దేవి ముందు నేతితో దీపం వెలిగిస్తే మంచి ఫలితాలను ఆశించవచ్చు.