ఆధ్యాత్మికం

ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం క‌ల‌గాలంటే మీ ఇంట్లో ఇలా చేయండి..!

వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరించడం వల్ల మంచి కలుగుతుంది. అలానే ఇంట్లో ఉండే సమస్యలను కూడా దూరమై పోతాయి. అయితే ఈ రోజు మనం పండితులు చెబుతున్న వాస్తు చిట్కాల‌ గురించి చూద్దాం. వీటిని కనుక అనుసరిస్తే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ వాస్తు చిట్కాలు గురించి చూద్దాం.

ప్రతి రోజు ఉదయాన్నే ముఖ ద్వారం కి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే ముఖద్వారం వద్ద స్వస్తిక్ ని పెట్టండి. ఇలా స్వస్తిక్ ని వేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పైగా ఇది చాలా మంచిది కూడా. అలానే ఆర్థిక ఇబ్బందులు కూడా దీని వల్ల కలుగకుండా ఉంటాయి.

do like this daily in your home for lakshmi devi blessings

అదే విధంగా ప్రతి రోజూ ఇంటి ముందు శుభ్రంగా కడిగి పిండి తో ముగ్గు పెడితే చాలా మంచిది. కాబట్టి ప్రతి రోజూ ఈ విధంగా అనుసరించడం మంచిది. అలానే దేవుడి గదిలో ఉదయం, సాయంత్రం కర్పూరం వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పైగా ఏదైనా సమస్యలు ఉంటే కూడా పరిష్కారమవుతాయి. చూశారు కదా పండితులు షేర్ చేసుకునే అద్భుతమైన చిట్కాలుని మరి వాటిని మీ ఇంట్లో ఫాలో అయ్యి సమస్యలేమి లేకుండా దూరంగా ఉండండి.

Admin

Recent Posts