ఆధ్యాత్మికం

క‌ర్పూరంతో ఇలా చేస్తే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా పోతాయి..

కొన్ని సమస్యలని పరిష్కరించడానికి పండితులు కొన్ని ఉపాయాలని చెప్పడం జరిగింది. వాటితో సమస్యలకి ఈజీగా చెక్ పెట్టేయొచ్చు. సాధారణంగా మనం పూజల్లో కర్పూరాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. కర్పూరానికి నెగెటివ్ ఎనర్జీని తరిమేసే శక్తి ఉందని చెబుతారు. అందువల్ల కర్పూరంతో పూజలు చేస్తే అంతా మేలే జరుగుతుందని చెబుతున్నారు.

అయితే మన జీవితంపై ప్రభావం చూపిస్తూ చంద్రుడు స్థానం మార్చుకుంటున్న కొద్దీ మనకు అనేక ప్రమాదాలు వచ్చి పడుతూ ఉంటాయి అని పండితులు అంటున్నారు. ఇటువంటి వాటి నుంచి బయట పడాలి అంటే కర్పూరం, లవంగాలను తమలపాకుల్లో చుట్టి కాళికామాత ముందు ఉంచాలి అని అంటున్నారు.

do like this with camphor to get luck and wealth

అలానే పెళ్లి అవ్వాలంటే పసుపు, కర్పూరాన్ని కలిపి దుర్గా మాత పూజ చేస్తే కనుక వివాహ సంబంధ సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి వివాహం త్వరగా అవ్వాలి అని అనుకునే వాళ్ళు చేయడం మంచిది.

అదే ఆర్ధికంగా బాధ పడేవారు కర్పూరం లో లవంగాలు వేసి కాల్చాలి. తర్వాత వాటిని నిద్ర పోయే ముందు బయట పడేయాలి. ఇలా చేయడం వలన ఆర్ధికంగా బాధలు ఏమైనా ఉంటే పోతాయి. అలానే ఉద్యోగాలు రాకపోయినా, సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటున్నా కూడా ఇది మంచి ఫలితాలను ఇస్తుంది.

Admin

Recent Posts