vastu

ఈశాన్యం దిశ‌లో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కండి..

వాస్తు శాస్త్రాన్ని పాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాస్తు శాస్త్రం పాటించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలానే అది వ్యక్తి గతంగా, ఉద్యోగ పరంగా కూడా ప్రయోజనాలను ఇస్తుంది. అయితే ఈరోజు వాస్తు శాస్త్రానికి సంబంధించి కొన్ని విషయాలు చూద్దాం..! వీటిని కనుక పాటించారు అంటే మీ ఇంట్లో లేదా ఆఫీస్ నుంచి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి.. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

ఈశాన్యం వైపు ఎలక్ట్రికల్ సామాన్లు పెట్టడం మంచిది కాదు. అలానే వేడిని ఇచ్చే సామాన్లని కూడా ఉంచ రాదు అని పండితులు చెప్తున్నారు. అయితే ఆ దిక్కు వైపు ఎలక్ట్రికల్ సామాన్లు ఉంచడం వల్ల రిలేషన్ షిప్స్ దెబ్బతింటాయని పండితులు చెబుతున్నారు. కనుక ఆ దిక్కు వైపు ఉంచరాదు. ఇలా ఉంచడం వల్ల ఒకరి మీద ఒకరికి గౌరవం కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడం కానీ ఒకరి మీద ఒకరు వినడం కానీ కుదరదు.

do not do these mistakes in north east corner

అందుకని ఈశాన్యం వైపు ఎలక్ట్రికల్ సామాన్లు ఉంచకండి. అలానే ఇంట్లో పగిలిపోయిన లేదా విరిగిపోయిన సామాన్లని ఉపయోగించడం మంచిది కాదు. ముఖ్యంగా మనం తినే ఆహార పదార్థాలు అటువంటి సామాన్లలో వేసుకుని తీసుకోకూడదు.

వీటి వల్ల మనకి చెడు జరుగుతుంది అని పండితులు చెప్తున్నారు. అలానే అష్టభుజి అడ్డం కూడా ఉత్తర దిక్కు వైపు ఉంచరాదు. అలా ఉంచడం వల్ల అప్పులు పెరిగి పోతాయి సమస్యలు ఎక్కువ అవుతాయి అని చెప్తున్నారు పండితులు.

Admin

Recent Posts