ఆధ్యాత్మికం

తాళిబొట్టుకు పిన్నీసులు తగిలి ఇస్తున్నారా… ఐతే ఇది తప్పక తెలుసుకోండి !

హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి మహిళ తన భర్తతో తాళి కట్టించుకుంటుంది. తాళి నే చాలామంది మంగళసూత్రం అని కూడా అంటారు. అయితే మంగళం అంటే శుభప్రదం, సూత్రం అంటే తాడు ఆధారం అని అర్థం. ప్రతి మహిళ ఈ మంగళసూత్రాన్ని ఎంతో జాగ్రత్తగా దాచుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే మంగళసూత్రం మహిళలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే పెళ్లయిన మహిళ గా గుర్తింపు ను ఇస్తుంది తాళిబొట్టు. అయితే మంగళసూత్రం విషయంలో మహిళలు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మంగళసూత్రం మహిళ హృదయాన్ని తాకుతూ..వక్ష స్థలం కింద వరకు ఉండాలి. పసుపు కుంకుమలు సౌభాగ్యానికి ప్రతీక లు కాబట్టి… మంగళ సూత్రాలను బంగారువి చేయించుకున్నా.. మధ్యలో తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి. నిత్యం తాడుకు పసుపు రాసుకోవడం అలాగే సూత్రాలకు కుంకుమ పెట్టుకోవడం మంచిది. సూత్రానికి ఎరుపు అలాగే నలుపు పూసలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.

do not put safety pin to mangala sutram know why

మంగళ సూత్రాలకు చాలామంది పిన్నీసులు పెడతారు కానీ వాస్తవానికి సూత్రాలకు ఎలాంటి ఇనుము వస్తువులు తాకకూడదు. ఇనుము ఎనర్జీని గ్రహిస్తుంది. దీంతో భర్త అనారోగ్యం పాలవుతారు అని అంతేకాకుండా ఇద్దరి మధ్య అన్యోన్యత తగ్గుతుందని చెబుతారు. మంగళసూత్రంలో ముత్యం అలాగే పగడం ధరిస్తూ ఉంటారు. ముత్యం అలాగే పగడం సూర్యుడి నుంచి వచ్చే కిరణాలలో ఎరుపు అలాగే తెలుపు స్వీకరించి ఆరోగ్యాన్ని ఇస్తుందట. పైగా జంట మధ్య ఉన్న గ్రహ దోషాలను కూడా తొలగిస్తుందని పండితులు చెబుతారు. స్త్రీలకు పూజా గ్రహ ప్రభావం వలన అతి కోపము, కలహాలు, మొండితనం, ఆనారోగ్యం, దోషాలు ఏర్పడతాయి. ముత్యం ధరించడం వల్ల వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది మహిళలు.

Admin

Recent Posts