హెల్త్ టిప్స్

రుతుక్ర‌మం స‌రిగ్గా రావ‌డం లేదా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

రుతుక్రమం సరిగా లేకపోవడమనేది మహిళలో సాధారణంగా వినిపించే సమస్య. ప్రత్యేకించి కొత్తగా రుతుక్రమం అయ్యేవారికి, రుతుక్రమం ఆగిపోయే మహిళలకు ఈ సమస్య వుంటుంది. రుతుక్రమం 3 నుండి 5 రోజులపాటు జరిగి 20 నుండి 32 రోజుల మధ్య వ్యవధితో వస్తూంటుంది. నెలసరి వచ్చే రుతుక్రమాన్ని అయిన రోజునుండి మరో రుతుక్రమం అయ్యే రోజునాటికి లెక్కించాలి. యవ్వనం వచ్చిన నాటినుండి, మెనోపాజ్ అంటే రుతుక్రమం ఆగిపోయే వయసువరకు స్త్రీకి ఈ సమయంలో గర్భ సంచి సహజంగా శుద్ధి చేయబడుతుంది.

బరువు కోల్పోవటం, వ్యాయామం అధికంగా చేయటం, స్మోకింగ్, కాఫీలు, మందులు, ఆహార లేమి, మొదలైనవి క్రమం తప్పిన రుతుక్రమానికి దోవతీస్తాయి. రక్తస్రావం అధికంగా వుండటం, కటి వలయం లేదా పొట్ట కిందిభాగంలో నొప్పి, పిరీయడ్స్ లేకపోవటం, మొదలైనవి, సరి అయిన సమయానికి రుతుక్రమం రాకపోవటానికి సంకేతాలు. అయితే, రుతుక్రమాన్ని సరిగా నియంత్రించుకోడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేమిటో చూద్దాం….. ములక్కాడలు, పొట్లకాయ, తెల్ల గుమ్మడి, నువ్వులు, కాకరకాయ మొదలైనవి బాగా తినండి. ఇవి రుతుక్రమాన్ని సరిగా వచ్చేలా చేస్తాయి. కాకర రసాన్ని అవసరపడితే రోజుకు రెండు సార్లు తాగి అయినా సరే రుతుక్రమం సరిగా వచ్చేలా చేసుకోవచ్చు.

women who are not getting periods follow these tips

నెలసరి వచ్చే ఒక వారం ముందు కోడిగుడ్డు, మాంసం, పసుపు గుమ్మడి, బంగాళ దుంపల వాడకం మానండి.నువ్వులు లేదా జీలకర్ర డికాషన్ వంటివి రుతుక్రమం సరిగా వచ్చేలా చేస్తాయి. రుతుక్రమ డేట్ కు ఒక వారం రోజుల ముందు వీటిని వాడాలి. నువ్వుగింజలు, మెంతి పొడి, బెల్లం కలిపిన మిశ్రమం బాగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసెడు గ్రేప్ జ్యూస్ తాగి కూడా పిరీయడ్స్ సహజంగా వచ్చేలా చూసుకోవచ్చు. ప్రతిరోజూ కొద్దిపాటి వ్యాయామం కూడా చేయాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి పిరీయడ్స్ సక్రమంగా వచ్చేలా చేస్తుంది. పచ్చి బొప్పాయి తినండి. పిరీయడ్స్ సక్రమంగా రావటమే కాదు. ప్రెగ్నెన్సీ వద్దనుకున్నా దీనిని వాడవచ్చు. మర్రి చెట్టు వేళ్ళ డికాషన్ పాలతో కలిపి మూడు నెలలు వరుసగా తీసుకున్నా రుతుక్రమం సరిగా వస్తుంది.

Admin

Recent Posts