ఆధ్యాత్మికం

Tuesday : మంగళవారం ఈ పనులు చేస్తే ఎంతో మంచిది.. కానీ చాలా మందికి ఈ విషయాలు తెలియవు..!

Tuesday : ప్రతి రోజూ మనం అన్ని పనులు చేయడానికి అనుకూలంగా ఉండవు. ముఖ్యంగా కొన్ని రోజుల్లో కొన్ని పనులను చేయడం అసలు మంచిది కాదని పండితులు అంటున్నారు. మంగళవారం నాడు ఈ తప్పుల్ని అస్సలు చేయకూడదు. తెలిసి చేసినా, తెలియక చేసినా ఇవి తప్పే అని తెలుసుకోండి. మంగళవారం అనగానే అమంగళంగా చాలామంది భావిస్తారు. కానీ నిజానికి మంగళవారం కొన్ని పనులు చేసుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది.

నవగ్రహాల్లో ఉన్న కుజుడు మంగళవారానికి అధిపతి. కుజుడు రౌద్రాన్ని కలిగి ఉంటాడు. కనుక మంగళవారం రోజు పది మంది కలిసి చేసే పనులని ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. పది మంది కలిసి చేస్తే కుజుడికి కోపం వస్తుంది. దాంతో నలుగురి మధ్య గొడవలు, కొట్టుకోవడం వంటివి జరుగుతాయి. మంగళవారం నాడు ఎంత పని ఉన్నా ఒక్కరే చేసుకోవడం మంచిది. మంగళవారం రోజు అప్పు తీసుకోకూడదు. మంగళవారం నాడు అప్పు తీర్చడం చాలా మంచిది.

doing these works on tuesday is good actually

మంగళవారం నాడు అప్పు తీరిస్తే మళ్లీ చేయవలసిన అవసరం రాదట. మంగళవారం శస్త్ర చికిత్స చేసుకునే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మంగళవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో గోళ్లు కత్తిరించడం, క్షవరం చేయించుకోవడం వంటి పనులు చేయకండి. మంగళవారం నాడు ఇల్లు, భూమిని కొనడం వంటివి చేయకూడదు. రిజిస్ట్రేషన్ పనులు కూడా చేయకూడదు.

మంగళవారం నాడు ఇటువంటి పనులు చేయడానికి తుది నిర్ణయం తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది. మంగళవారం నాడు క్రీడలకు సంబంధించిన కోచింగ్‌లో చేరడం కూడా మంచిది. మంగళవారం నాడు వాహనాలు మాత్రం కొనుగోలు చేయకూడదు. మంగళవారం నాడు నూతన వ్యాపారాలు ప్రారంభించడం కూడా మంచిది కాదు. మంగళవారం నాడు వ్యవసాయదారులు మిరప, అల్లం, ఉల్లి, వెల్లుల్లి, పొగాకు వంటి వాటికి సంబంధించిన పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

Admin

Recent Posts