ఆధ్యాత్మికం

తులసి మొక్కను ఇంట్లో పెడుతున్నారా..? అయితే ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

హిందువులు తులసి మొక్కని పూజిస్తారు. పవిత్రమైన తులసి మొక్కని ఇళ్లల్లో పెంచడం చాల మంచిది అని అంటూంటారు. తులసి మొక్కని లక్ష్మీ స్వరూపంగా తులసి దేవతగా భావించి పూజిస్తూ ఉంటారు. ఇలా చాలా మంది ఇళ్లల్లో తులసి మొక్కను పూజించడం, తులసి దళాలని పూజ లో ఉపయోగించడం చేస్తూ ఉంటారు. తులసి మొక్కని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగిటివిటీని తొలగిస్తుంది. అలానే పాజిటివ్ ఎన‌ర్జీని పెంపొందిస్తుంది. దీని వలన ఇల్లు మొత్తం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అయితే తులసి మొక్కని మన ఇంట్లో ఎక్కడ ఉంచాలి…?, ఎక్కడ ఉంచకూడదు..? అనేది తెలుసుకుందాం.

మనం సరైన దిక్కులో ఉంచకపోతే ఇంట్లోకి ధనం రాదు అని పండితులు చెప్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కని ఇంటి పై కప్పు మీద ఉంచితే మంచిది కాదు అని అంటున్నారు. చాలా మంది ఇంటి రూఫ్ మీద తులసి మొక్కని ఖాళీ లేక పెట్టేస్తుంటారు. కానీ అలా చేయడం మంచిది కాదు అని అంటున్నారు. బుధ దోషం కలిగిన వాళ్ళు ఇంటి పై కప్పు పై తులసి మొక్కలు పెంచితే ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది. ఇంటి పై కప్పు పై తులసి మొక్కని పెంచడం వల్ల అక్కడ పక్షులు పావురాలు గూళ్ళు పెట్టడం కూడా చెడు సంకేతం అని పండితులు చెప్తున్నారు.

if you are putting holy basil in your home do not make these mistakes

దీని వల్ల ధన నష్టం కలుగుతుందని, చాలా మంది ఆర్థికంగా నష్టపోతారని పండితులు అంటున్నారు. ఎప్పుడు కూడా తులసి మొక్కని ఈశాన్యం వైపు ఉంచాలి లేదు అంటే పడమర దిక్కు లో కూడా మీరు ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో, కుటుంబంలో ఉంటుంది.

పవిత్రమైన ఈ మొక్క వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం ఉన్నాయి. దీన్ని ఆయుర్వేద మందుల‌లో కూడా ఉపయోగిస్తుంటారు. ఇదిలా ఉంటే ప్రతి రోజూ తులసి మొక్కను పూజించడం వల్ల చెడు భావనలు తొలగిపోతాయి. వంటింటికి దగ్గర్లో కానీ వంటింట్లో కానీ ఉంచడం వల్ల ఇంట్లో ఉండే వారి సంబంధాలు మరింత మంచిగా ఉంటాయి. కుటుంబం మధ్య ప్రేమ ఆప్యాయతలు అభివృద్ధి చెందుతాయి.

Admin

Recent Posts