హనుమంతుని జీవితం గురించి వివిధ గాధలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. హనుమంతుడు, హనుమాన్, ఆంజనేయుడు ఇలా రకరకాల పేర్లు కలిగాడు ఆ ఆంజనేయస్వామి. ఏ పేరుతో పిలిచినా పలికే హనుమంతుడికి భక్తులు చాలా ఎక్కువే. ఆంజనేయుడిని ఎక్కువగా పూజించడానికి ముఖ్య కారణం.. అతని నిజాయితీ, మానవత్వం, బలం, జ్ఞానం నిజమైన భక్తిని కలిగి ఉండటమే. అయితే మనం ఏ దేవాలయానికి వెళ్లిన మూడు ప్రదక్షిణలు చేస్తాం. కానీ హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఎలా చేయాలి? అనే విషయం తెలుసుకుందాం.
హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షణలు చేయాలి. ప్రదక్షిణన మస్కారాం సాష్టాంగన్ పంచ సంఖ్యాయ అని ఆర్ష వ్యాక్యం. ప్రతి ప్రదక్షిణము తర్వాత ఒకచోట ఆగి ఈ శ్లోకం చెప్పుకొని తిరిగి ప్రదక్షిణము చేయవలెను. మామూలుగా ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువుకోవాలి. సకల రోగ, భూత ప్రేత పిశాచాది బాధలు తొలగుటకు, అబిష్ఠకి ప్రదక్షిణలు సుప్రసిద్దాలు. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసి సంతానం పొందినవారు ఎందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. అలాగే నియమాలు పాటించడం కూడా ఎంతో ముఖ్యం. హనుమంతునికి ప్రదక్షిణలు అంటే చాలా ఇష్టం. స్వామి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ప్రతి ప్రదక్షిణ తర్వాత ఆగి చెప్పుకోవాల్సిన శ్లోకము..
ఆంజనేయం మహావీరం! బ్రహ్మ విష్ణు శివాత్మకం! అరుణార్కం ప్రభుం శ్రమథం! రామదూతం నమామ్యహం! రోజు ఒకే మారు 108 లేదా 54 అది చేయలేని వారు 27 ప్రదక్షిణములు చేయాలి. పుష్పములు, వక్కలు, పసుపు కొమ్ములు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ఇక ప్రదక్షిణలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్లో || ఆంజనేయం మహావీరం – బ్రహ్మ విష్ణు శివాత్మకం తరునార్క ప్రభంశాంతం – రామదూతం నమామ్యహం శ్లో || మర్కటే శ మహో త్సాహ – సర్వశోక వినాశన శత్రున్సంహర మాం రక్ష – శ్రియం దాపాయమే ప్రభో || అని చదువుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.