వినోదం

కొత్త బంగారులోకం మూవీలో బ్లండర్ మిస్టేక్ ఏంటో తెలుసా?

కొత్త బంగారులోకం చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయింది. ఈ మూవీ ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకుంది. కుర్ర కార మదిని గిలిగింతలు పెట్టేలా అందంగా ఈ ప్రేమ కథను తీర్చిదిద్దారు. ఇక ఈ సినిమాకు మెయిన్ ఆసెట్ పాటలు. మిక్కీ జే మేయర్ సంగీతంలోంచి జాలు వారిని ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అని చెప్పొచ్చు. ప్రేమను, బాధను, విరహాన్ని కాలేజీ నేపథ్యాన్ని వివరిస్తూ సాగే ఈ పాటలు అప్పట్లో ప్రతి కాలేజీలోనూ వినిపించాయి.

అయితే, కొత్త బంగారులోకం మూవీలో ఒక బ్లండర్ మిస్టేక్ ఉంది. అదేంటో తెలుసా? ఇప్పటికీ దాన్ని ఎవరు గుర్తించలేకపోయారు. కొత్త బంగారులోకం మూవీలో అమ్మాయి ప్రేమలో నిండా మునిగి లేచిపోవడానికి రెడీ అయిన హీరో వరుణ్ సందేశ్ తన నాన్న సడన్ గా చనిపోవడంతో అమ్మతోపాటు ఉండి చదువు పూర్తి చేశాడు. లేచిపోవడానికి వచ్చిన హీరోయిన్ ను వదిలేస్తాడు. అయితే చివర్లో క్లైమాక్స్ లో అమ్మాయి తండ్రి కనిపించి ఏం పూర్తి చేశావు? ఎలా ఉన్నావు? అని హీరో వరుణ్ ను అడిగితే ఇంజనీరింగ్ అయిపోయింది అంకుల్ అని సమాధానం ఇస్తాడు.

blunder mistake in kotha bangaru lokam movie

నిజానికి ఇంటర్ లో హీరో వరుణ్ చదివింది బైపిసి. ల్యాబ్ లోను ప్రయోగాలు చేస్తూ కనిపిస్తాడు. కానీ చివరకు ఇంజనీరింగ్ పట్టా అందుకున్నట్టు క్లైమాక్స్ లో చూపిస్తారు. ఇదో పెద్ద మిస్టేక్. దానిపై ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రోల్స్, సెటైర్లు పడుతున్నాయి.

బైపిసి చదివి ఇంజనీర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు అంటూ ట్రోల్స్ హోరెత్తుతున్నాయి. సినిమా తీసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే నెటిజెన్లు ఆటాడుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Admin

Recent Posts