ఆధ్యాత్మికం

Lakshmi Devi : లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే.. ఈ తప్పులను అస్సలు చేయకండి..!

Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా, ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని అనుకుంటుంటారు. లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు. ఏ సమస్యలు లేకుండా, సంతోషంగా ఉండొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్ళు, తప్పక వీటిని పాటించడం మంచిది. హిందూ పురాణాల ప్రకారం, లక్ష్మీదేవిని సంపదకి, శ్రేయస్సుకి అధిపతిగా భావిస్తారు. ఆర్ధిక సమస్యలు తొలగిపోవడానికి, ధన లాభం పొందడానికి, లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే, బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే, కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది.

లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోకుండా, లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఇలా చేయడం మంచిది. మనం చేసే చిన్న చిన్న పనులు మన జీవితం పై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోని ఉంచేటప్పుడు, తప్పనిసరిగా కొన్ని నియమాలని పాటించాలి. ఈ పొరపాట్లని అస్సలు చేయకూడదు. లక్ష్మీదేవి ఫోటోని ఇంట్లో ఎక్కడ పెట్టాలి..? వాస్తు ప్రకారం వేటిని పాటించాలి అనేది చూద్దాం.

if you want lakshmi devi blessings then do not make these mistakes if you want lakshmi devi blessings then do not make these mistakes

లక్ష్మీదేవి ఫోటోని, ఇంట్లో ఉంచడానికి ఉత్తమ ప్రదేశం ఈశాన్యం. ఈశాన్యం వైపు లక్ష్మీదేవిని ఉంచితే మంచిది. లక్ష్మీదేవి ఫోటోని ఈ వైపు ఉంచడం కుదరకపోతే, తూర్పు లేదా ఉత్తరం వైపు పెట్టాలి. ఇంట్లో పూజగది ఉంచడానికి శ్రేష్టమైన ప్రాంతం. పూజ చేసే ఫోటోలు తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. లక్ష్మీదేవి ఫోటోని ఎప్పుడూ దక్షిణం వైపు ఉంచకండి. లక్ష్మీదేవి ఫోటో దగ్గర విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచడం మంచిది.

పూజ గదిలో అయినా ఇంట్లో హాల్లో అయినా ఒకటి కంటే ఎక్కువ లక్ష్మీదేవి ఫోటోలని పెట్టుకోకూడదు. లక్ష్మీదేవి ఫొటోల్లో దాదాపుగా రెండు చేతులతో సంపదని ప్రసాదించడం కనపడుతుంది. అది లక్ష్మీదేవి స్వభావాన్ని చూపిస్తుంది. సానుకూల శక్తిని ప్రతిబింబించే ఎరుపు బంగారం చీరను ధరించి ఉంటుంది. ఇటువంటి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే కష్టాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.

Admin

Recent Posts