Rahul Dravid : రాహుల్ ద్రావిడ్.. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని అంటూ ఎవరూ ఉండరు. రాహుల్ ద్రావిడ్, సచిన్, గంగూలీ.. వీళ్లందరూ సమకాలీకులు. అయినప్పటికీ ఎవరి గొప్పదనం వారిదే. ఎవరి శైలి వారిదే. అయితే సచిన్, గంగూలీ కన్నా ద్రావిడ్‌ను అభిమానించే వారే ఎక్కువగా ఉంటారు. అది కూడా ఒక్క విషయంలో. ఆయన ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడంటే.. ఇక ప్రత్యర్థి జట్టుకు చుక్కలే. ఎందుకంటే ఒక పట్టాన ఔట్ కాడు. ఇక టెస్టుల్లో అయితే జట్టుకు ఒక గోడలా నిలుస్తాడు. జట్టుకు అడ్డుగోడలా ఉండి ద్రావిడ్ ఎన్నో మ్యాచ్‌లలో భారత్‌ను గట్టెక్కించాడు. అందుకనే ఆయనను ది వాల్ అని పిలుస్తారు. అయితే ద్రావిడ్ తన కెరీర్‌లో ఒకసారి వేరే జట్టుకు ఆడాడు. అది ఎప్పుడు.. ఆ జట్టు ఏది ? అంటే..
రాహుల్ ద్రావిడ్ కేవలం భారత్‌కే కాక స్కాట్లండ్ జట్టు తరఫున కూడా ఆడాడు. అది 2003వ సంవత్సరంలో అతను ఆ జట్టు తరఫున ఆడాడు. మొత్తం 11 మ్యాచ్‌లను ఆడిన ద్రావిడ్ 600 పరుగులు చేశాడు. అప్పట్లో భారత్‌కు జాన్ రైట్ హెడ్ కోచ్‌గా ఉండేవారు. ఆ సమయంలోనే ద్రావిడ్ స్కాట్లండ్ జట్టుకు ఓవర్సీస్ ప్రొఫెషనల్ ప్లేయర్‌గా ఆడాడు. ఇందుకు గాను 3 నెలలు సమయం కేటాయించాడు. దీంతో ద్రావిడ్‌కు 45వేల పౌండ్ల వేతనాన్ని కూడా ఇచ్చారు. ఇక ఆ సమయంలో మొత్తం ఆడిన మ్యాచ్‌లు అన్నీ వన్డేలే కావడం విశేషం.
ఆ మ్యాచ్‌లలో ఒక టూర్ గేమ్ పాకిస్థాన్‌తో ఆడాడు. 11 మ్యాచ్‌లలో ద్రావిడ్ 66.66 సగటుతో ఏకంగా 600కు పైగా పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 92.73 స్ట్రైక్ రేట్‌తో ద్రావిడ్ ఆ పరుగులను సాధించాడు. ఇక అదే సీజన్‌లో ద్రావిడ్ టెస్టుల్లో 95.46 సగటును సాధించగా.. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్లో 270 పరుగులు చేశాడు. ఆ సీజన్ లో ద్రావిడ్ మొత్తం 22 సెంచరీలను 41.77 సగటుతో సాధించడం విశేషం. అందుకనే ద్రావిడ్‌ను ది వాల్‌గా అభివర్ణించారు. ఇక ద్రావిడ్ ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు.