Wealth : ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా, చాలా విషయాలను ప్రస్తావించారు. చాణక్య చెప్పినట్లు చేస్తే, అద్భుతంగా మన జీవితాన్ని మార్చుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉండాలని చూస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంపదని పెంచుకోవాలంటే, ఇలా చేయడం మంచిదని చాణక్య అన్నారు. ఆచార్య చాణక్య చెప్పినట్లు చేస్తే, లక్ష్మీదేవి మన ఇంట నిత్యం కొలువై ఉంటుంది. డబ్బుకు లోటే ఉండదు. ఆర్థిక సమస్యలే ఉండవు. సంతోషంగా ఉండొచ్చు.
ఆచార్య చాణక్య కష్టపడి పనిచేసే వారి దగ్గర, ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఉంటుందని, లక్ష్మీదేవి అక్కడ నిత్యం కొలువై ఉంటుందని చాణక్య చెప్పారు. కాబట్టి ఎప్పుడూ కూడా కష్టపడి పని చేయాలి. పైగా కష్టపడి పనిచేసే వారికి, డబ్బు విలువ తెలుస్తుంది. అలాంటి వారి వద్ద, డబ్బు ఎక్కువ కాలం ఉంటుంది. శ్రమించే వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడు ఉంటుందని చాణక్య చెప్పారు. కాబట్టి ఎప్పుడూ కూడా కష్టపడి పని చేస్తూ ఉండాలి.
భార్య భర్తల మధ్య గొడవలు సహజంగా వస్తుంటాయి. కానీ, నిరంతరం భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే, ప్రశాంతత ఉండదు. కాబట్టి, నిత్యం గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు. ఎంత కష్టపడుతున్న, ఎంత శ్రమిస్తున్న అనే దాంతో సంబంధం లేకుండా, ఇంట్లో ప్రశాంతత లేదంటే ఇంట్లో తరచూ గొడవలు వస్తూ ఉంటాయి. అప్పుడు లక్ష్మీదేవి రాదు.
బదులుగా మంచి వాతావరణం, మానసిక ప్రశాంత, కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధం ఉంటే, లక్ష్మీదేవి వస్తుంది. అలానే మూర్ఖులు, మోసపూరిత వ్యక్తుల వద్ద డబ్బు ఉండదు. వాళ్ళు పూర్తిగా స్వార్థపూరితులు. ఎప్పుడూ కూడా ఎలా ఉంటారనేది ఊహించలేము. అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి, మోసం చేయడం వంటివి మంచిది కాదు. మంచి లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది.