ఆధ్యాత్మికం

Naramukha Vinayaka : తొండం లేని గ‌ణ‌ప‌తి ఆల‌యం.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

Naramukha Vinayaka : ఏ విఘ్నాలు లేకుండా మనం తలపెట్టిన కార్యం పూర్తి అవ్వాలంటే ఖచ్చితంగా మొదట మనం గణపతిని పూజించాలి. ఏదైనా పండగ అయినా, పూజ అయినా, పెళ్లి అయినా కూడా మొట్టమొదట మనం వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటాము. ఆ తర్వాత మిగిలిన పనుల్ని మొదలు పెడతాము. విఘ్నాలు ఏమీ లేకుండా శ్రీకారం చుట్టిన పనులు పూర్తవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుడిని పూజించాలి. వినాయకుడికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే ఏ వినాయకుడుని చూసినా వినాయకుడికి తొండం ఉంటుంది.

కానీ తొండం లేకుండా ఉన్న వినాయక ఆలయం గురించి మీరు విన్నారా..? మరి ఈ ఆలయం గురించి, ఆ వినాయకుడి గురించి తెలుసుకుందాం… నరముఖ గణపతి ఆలయం తమిళనాడులో ఉంది. ఇక్కడికి చాలామంది వెళ్తూ ఉంటారు. పితృ దోషాలతో బాధపడే వాళ్ళు ఇక్కడకి వెళితే ఆ పితృ దోషం నుండి బయటపడి, సుఖంగా ఉండొచ్చు. తిలతర్పణపురి అనే గ్రామంలో ఈ స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వరార్ ఆలయం ఉంది.

lord ganesha temple in human form

భారత దేశం అంతా తిరిగి ఎన్ని చోట్ల పిండాలు పెట్టినా, ముక్తి రాకపోవడంతో రాములవారు శివుడిని ప్రార్థించగా… పరమశివుడు ఈ కొలనులో స్నానం చేసి, ఇక్కడ పితృతర్పణలు మొదలు పెట్టమని చెప్పారట. అందుకే ఈ ఊరిని తిలతర్పణపురి అని అంటారు. తిల అంటే నువ్వులు. తర్పణం అంటే వదిలిపెట్టడం. రాములు వారు ఇక్కడ వదిలిపెట్టారు కనుక ఆ ఊరిని ఈ పేరుతో పిలవడం మొదలుపెట్టారు.

రాములవారు తన తండ్రి దశరధునికి నాలుగు పిండాలు పెట్టారు. ఆ తరవాత ఆ వంశంలోని వారు లింగాల రూపంలో మారారు. ఎవరైతే ఆలయం దగ్గరకు వచ్చి పిండ ప్రధానం చేస్తారో వాళ్లకి పితృ దోషం ఉండదు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నర ముఖంతో ఉన్న గణపతి ఉంటారు. తొండం లేకుండా బాలగణపతి రూపంలో ఇక్కడ వినాయకుడు ఉంటారు. నరముఖ గణపతి లేదా ఆది వినాయక గణపతి అని ఈ వినాయకుడిని పిలుస్తారు. తమిళనాడులోని తిరునల్లార్శని భగవానుని ఆలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది.

Admin

Recent Posts