వినోదం

Shruti Haasan : గబ్బర్ సింగ్ మూవీలో మొద‌ట‌ శృతి హాస‌న్‌ను తీసుకోవద్దన్న బండ్ల గణేష్.. కానీ పవన్ ఏం చేశారో తెలుసా..?

Shruti Haasan : జల్సా చిత్రం తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ చిత్రం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. గబ్బర్ సింగ్ దర్శకనిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. గబ్బర్ సింగ్ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది. ఈ సినిమాకు ముందు శృతిహాసన్ సైతం వరుస ఫ్లాపులతో ఐరన్ లెగ్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది.

ఈ చిత్రంతో శృతి హసన్ లక్ మారిపోయింది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శృతిహాసన్ గబ్బర్ సింగ్ తో మంచి విజయం అందుకుంది. చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ముందుగా శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకోవడానికి భయపడ్డానని ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. ముందుగా శ్రుతిహాసన్ ను హీరోయిన్ గా అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయని, కాబట్టి హీరోయిన్ గా ఆమెను తప్పించే ఆలోచన చేసినట్టు తెలిపారు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కు వెళ్లి చెప్పగా.. నువ్వు అన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలు మాత్రమే తీశావా అంటూ తనపై పంచ్ వేశారని ఆ తర్వాత శృతినే సినిమాలో కంటిన్యూ అయిందని బండ్లగణేష్ వెల్లడించారు.

shruti haasan is not the first choice for gabbar singh movie

ఇక ఈ చిత్రం సక్సెస్ తో శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంటూ రేసుగుర్రం, బలుపు, ఎవడు, శ్రీమంతుడు వంటి చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్ ల‌ను తన ఖాతాలో వేసుకుంది. గబ్బర్ సింగ్ చిత్రంతో అప్పటివరకు ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న శృతి హాసన్ ఆ తర్వాత హీరోలకు గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ 2 లో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లోనూ శృతిహాసన్ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.

Admin

Recent Posts