ఆధ్యాత్మికం

Lord Shiva Flowers : శివున్ని ఈ పుష్పాల‌తో పూజిస్తే.. స‌క‌ల పాపాలు పోతాయి..

Lord Shiva Flowers : కార్తీక మాసంలోనే కాదు.. ఇత‌ర స‌మ‌యాల్లోనూ చాలా మంది శివున్ని పూజిస్తుంటారు. ప్ర‌తి సోమ‌వారం పూజ‌లు చేసి ఉప‌వాసాలు ఉంటారు. శివుడికి సోమవారం పూజ‌లు చేయ‌డం వ‌ల్ల మ‌రుజ‌న్మ ఉండ‌ద‌ని.. నేరుగా కైలాసానికి చేరుకుంటార‌ని చెబుతుంటారు. అందుక‌నే చాలా మంది మోక్షం కోసం శివున్ని పూజిస్తారు. అయితే శివున్ని పూజించేందుకు ప‌లు ర‌కాల పుష్పాల‌ను వాడాలి. వాటిని వాడ‌డం వ‌ల్ల శివానుగ్ర‌హం ల‌భిస్తుంది. శివుడు సంతోషిస్తాడు. మ‌న‌ల్ని అనుగ్ర‌హిస్తాడు. శివానుగ్ర‌హం కోసం ఏయే పుష్పాల‌ను పూజ‌ల‌కు వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌ర‌మ శివుడి పూజ‌ల‌కు వాడాల్సిన పుష్పాలు.. క‌ర‌వీరం (గ‌న్నేరు), అర్కం (జిల్లేడు), మందారం, శ‌మీ (జ‌మ్మి), బొగ‌డ‌, మోదుగ‌, ఇప్ప‌, వెంప‌లి, బిల్వం (మారేడు), అపామార్గం (ఉత్త‌రేణి), క‌లిగొట్టు, అశోకం, అవిసె, ఉమ్మెత్త‌, కొండ‌గోగు, క‌డిమి, న‌ల్ల గోరింట‌, సుర‌పొన్న‌, ఎర్ర గోరింట‌, ఎర్ర దేవ‌కాంచ‌నం, సంపెంగ‌, మ‌ల్లి, పండు గురివెంద‌, జాజి, తుమ్మి, నూరు రేకుల ప‌ద్మం, వెయ్యి రేకుల ప‌ద్మం, తెల్ల క‌లువ‌, న‌ల్ల క‌లువ‌, తాపింఛం, తుల‌సి.. ఈ చెట్ల‌కు చెందిన పుష్పాల‌ను శివ పూజ‌కు వాడాలి. దీంతో స‌క‌ల శుభాలు క‌లుగుతాయి. శివుడు అనుగ్ర‌హిస్తాడు. శివున్ని ఈ పుష్పాల‌తో పూజిస్తే స‌క‌ల పాపాలు తొల‌గిపోతాయి.

pray to lord shiva with these flowers to get away sins

అయితే పైన తెలిపిన పుష్పాల్లో అన్నింటినీ వాడాల‌ని ఏమీ లేదు. మ‌న‌కు అందుబాటులో ఉండేవాటిని వాడ‌వ‌చ్చు. ప్ర‌తి సోమ‌వారం ఈ పుష్పాల‌తో పూజ‌లు చేస్తూ ఉప‌వాసం ఉండాలి. దీని వ‌ల్ల అనుకున్న‌ది నెర‌వేరుతుంది. ఎంతో పుణ్యం ల‌భిస్తుంది. క‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Admin

Recent Posts