వినోదం

Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్ చనిపోవడానికి ముందు న‌రేష్ తో మాట్లాడిన చివ‌రి మాట‌లు ఇవే..!

Uday Kiran : చాలా త‌క్కువ స‌మయంలోనే సినిమా ఇండ‌స్ట్రీలో పాపుల‌ర్ అయిన హీరోల‌లో ఉద‌య్ కిర‌ణ్ ఒక‌రు. చిత్రం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్.. ఆ తరవాత నువ్వు నేను, మనసంతానువ్వే చిత్రాలతో సక్సస్ ని అందుకుని హ్యాట్రిక్ హీరోగా, లవర్ బాయ్ గా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఉద‌య్ కిర‌ణ్ ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యాడు. ఈ సక్సెస్ లతో ఉదయ్ కిరణ్ కి ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. అప్ప‌ట్లోనే ఉద‌య్ అగ్ర హీరోల‌కు దీటుగా ఎద‌గ‌డం ప్రారంభించాడు. అంతే కాకుండా స్టార్ డైరెక్టర్లు కూడా డేట్స్ కోసం ఎద‌రు చూసే స్థాయికి ఉద‌య్ కిర‌ణ్ చేరుకున్నాడు.

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఉదయ్ కిరణ్ సహజమైన నటనతో ఇండస్ట్రీలో హీరోగా మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఉద‌య్ కిర‌ణ్ జీవితంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల సినిమా అవ‌కాశాలు తగ్గటం ప్రారంభమయ్యింది. ఈ క్రమంలోనే విషితను వివాహం చేసుకోవడం, అక్క‌డ కూడా స‌మస్య‌లు ఎదుర‌వ‌డం వ‌ల్ల డిప్రెష‌న్ లోకి వెళ్లిన ఉద‌య్ కిర‌ణ్ చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య చేసుకుని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అయితే ఉద‌య్ కిర‌ణ్ కు సినీ పరిశ్రమలో ఉన్న స్నేహితుల్లో హీరో అల్లరి న‌రేష్ కూడా ఒక‌రు. న‌రేష్, ఉద‌య్ కిర‌ణ్ గురించి ఓ ఇంట‌ర్య్వూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

uday kiran last words with naresh

ఉద‌య్ కిర‌ణ్ చ‌నిపోయే ముందు హీరో న‌రేష్ ఆయ‌న‌ను కలవటం జరిగిందట. ఆ సమయంలో ఉద‌య్ కిర‌ణ్ ముఖంలో దిగులు, బాధ కనిపించాయట. దాంతో ఎందుకు ఉద‌య్ అలా డ‌ల్ గా ఉన్నావు అని ప్రశ్నించాను అని నరేష్ తెలియజేశాడు. నరేష్ ప్రశ్నకు సమాధానంగా ఉదయ్ కిరణ్ ఓ పేపర్ లో యంగ్ హీరో క‌థ‌లు సరిగ్గా ఎంచుకోవ‌డం లేద‌ని రాశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడ‌ట‌. దానికి న‌రేష్ ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు. నీకు సంబంధించిన విష‌యం కాదు క‌దా అని అన్నానని తెలిపాడు నరేష్.

దాంతో ఉద‌య్ కిర‌ణ్ ఆ యంగ్ హీరో క‌థ‌లు స‌రిగ్గా ఎంచుకోక‌పోతే అత‌డికి కూడా ఉద‌య్ కిర‌ణ్ కు ప‌ట్టిన గ‌తే ప‌డుతుంద‌ని ఆ పేపర్ లో రాశారని బాధ‌ప‌డ్డాడ‌ట‌. దాంతో న‌రేష్.. ఉదయ్ కిరణ్ ని చూసి ఉద్వేగానికి గురయ్యాడ‌ట‌. ఆ విషయంతో ఉద‌య్ కిర‌ణ్ ఎంతో డిప్రెష‌న్ లో ఉన్నాడ‌ని నరేష్ కి అర్థ‌మైంద‌ట‌. ఇక ఉద‌య్ కిర‌ణ్ చనిపోయిన త‌ర‌వాత అత‌డి మృతికి డిప్రెష‌న్ కూడా కార‌ణ‌మ‌ని న‌రేష్ కు అనిపించింద‌ని ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించాడు.

Admin

Recent Posts