చిట్కాలు

Biryani Leaves For Sugar : బిర్యానీ ఆకుల‌ను ఇలా తీసుకుంటే.. షుగ‌ర్ ఎంత ఉన్నా త‌గ్గుతుంది..!

Biryani Leaves For Sugar : బిర్యానీ చేసుకునేటప్పుడు మనం బిర్యానీ ఆకుని వాడుతూ ఉంటాము. బిర్యానీ ఆకు కేవలం వంటకి మంచి ఘాటు, సువాసనని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలని అందిస్తుంది. బిర్యాని ఆకు వలన ఎన్నో లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బిర్యాని ఆకుల వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి…? ఏయే సమస్యలకి దూరంగా ఉండొచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఒకటి నుండి మూడు గ్రాముల బిర్యానీ ఆకుల‌ను తీసుకోవడం వలన 30 రోజుల్లో మధుమేహం, గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చ‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఈ మసాలా ఆకు వివిధ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు బిర్యాని ఆకుని తీసుకోవడం వలన గ్లూకోస్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయ‌ని అంటున్నారు. బిర్యానీ ఆకులు రక్తంలో గ్లూకోస్ స్థాయిలని తగ్గిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తాయి. ఎల్‌డీఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించేందుకు కూడా బిర్యానీ ఆకులు సహాయపడతాయి. 30 రోజులపాటు ఒక గ్రాము లేదంటే మూడు గ్రాముల వరకు బిర్యానీ ఆకుల్ని తీసుకుంటే షుగర్ ఉన్నవాళ్లు షుగర్ నుండి బయట పడొచ్చు.

Biryani Leaves For Sugar take like this

బిర్యానీ ఆకులని పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. షుగర్ ఉన్నవాళ్లు బిర్యానీ ఆకుని ఏదో ఒక రూపంలో తీసుకుని షుగర్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. బిర్యానీ ఆకు ఇన్సులిన్ విడుదలకు కూడా సహాయపడుతుంది, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్ మనకి ఎంతగానో సహాయపడతాయి. ఇందులో ఇతర యాంటీ డయాబెటిక్ మూలికలు కూడా ఉంటాయి. బిర్యానీ ఆకుని మనం టీ లాగా కూడా చేసుకుని తీసుకోవచ్చు. దీనికోసం మీరు రెండు, మూడు బిర్యానీ ఆకులని ఒక కప్పు నీళ్లు, చక్కెర లేదంటే తేనెను తీసుకోండి.

కావాలంటే పాలు కూడా తీసుకోవచ్చు. ఒక గిన్నెలో నీళ్లు పోసి బిర్యానీ ఆకులు వేసి మూడు నాలుగు నిమిషాల‌ పాటు మరిగించండి. కావాలంటే మీరు బిర్యానీ ఆకుల‌ను పొడి చేసుకుని వేసుకోవచ్చు. ఆ తర్వాత వడకట్టేసి ఇందులో కొంచెం తేనెను కానీ పంచదారని కానీ వేసుకుని పాలు కూడా వేసుకోండి. వేడివేడిగా ఈ టీ ని తీసుకుంటే చాలా చక్కటి ఫలితం ఉంటుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి దూరంగా ఉండొచ్చు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఇందులో ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇలా అనేక లాభాలను మనం బిర్యానీ ఆకులతో పొందవచ్చు.

Share
Admin

Recent Posts