ఆధ్యాత్మికం

వెన్న‌తో ల‌క్ష్మీదేవికి ఇలా నైవేద్యం పెట్టండి.. అంతులేని సంప‌ద ల‌భిస్తుంది..

చాలా మంది ఎంత డబ్బులు సంపాదిస్తున్నా కూడా చేతిలో ఉండటం లేదని బాధ పడుతుంటారు..చాలా వరకూ ఖర్చులను తగ్గించుకున్నా కూడా ఏదొక రూపంలో డబ్బులు ఖర్చు అయి పొతాయని అంటుంటారు. లైఫ్ లో ఆర్థికంగా బాగా స్థిరపడాలి అన్నా, డబ్బులు బాగా సంపాదించాలి అన్నా మనపై తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. మరి డబ్బులు నిలబడాలి అంటే లక్ష్మీదేవికి ఏ విధంగా పూజ చేయాలి ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలామంది లైఫ్ లో బాగా స్థిరపడాలని కష్టపడి డబ్బు సంపాదించినప్పటికీ అనుకోని విధంగా డబ్బులు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతూ ఉండడంతో వాళ్ల కష్టానికి తగిన ఫలితం లభించదు. దాంతో వారు ఎంత సంపాదించినా కూడా నిరాశ చెందుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే డబ్బు నిలవకపోవడానికి అనారోగ్య సమస్యలు కూడా ముఖ్య కారణం అని చెప్పవచ్చు. కనుక ఆరోగ్యంగా ఉండాలి అన్నా సంపాద నిలవాలి అన్నా లక్ష్మీదేవిని తప్పకుండా పూజించాలి. లక్ష్మీదేవిని పూజించి ఆమె అనుగ్రహం పొందడం వల్ల ఆర్థికంగానే కాదు, ఆరోగ్య పరంగా కూడా బాగుంటారు.

put naivedyam with venna like this for lakshmi devi to get wealth

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సోమవారం రోజున తల స్నానం చేసి సూర్యోదయం సమయంలో అనగా 6 నుంచి 7 గంటలలోపు పెరుగు చెక్క కవ్వంతో చిలికిన వెన్నను తీయాలి. పెరుగును చిలక డానికి చెక్క కవ్వంని మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాం. అలా తయారు చేసుకున్న ఆ వెన్నని పాడవకుండా జాగ్రత్తగా భద్ర పరుచుకోవాలి. శుక్రవారం రోజు ఉదయాన్నే తల స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకొని లక్ష్మీదేవి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఆ వెన్నలో పొడి పటిక బెల్లాన్ని కలిపి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేసిన తర్వాత ఆ వెన్న నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న పిల్లలకు తినిపించాలి. ఇలా 11 వారాలు చేయడం వల్ల లక్ష్మీదేవి సంతృప్తి చెంది మనపై అనుగ్రహం చూపిస్తుందని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts