ఆధ్యాత్మికం

మందార పువ్వుల‌తో సూర్యున్ని ఇలా పూజించండి.. అంతులేని సంప‌ద‌, ఆరోగ్యం సిద్ధిస్తాయి..

మందారం పూల రంగు ఆకర్షిస్తుంది..వీటిని స్త్రీలు ఎక్కువగా ఇష్ట పడతారు.ఆ మందార పువ్వులలో ఎర్ర మందారపు పువ్వు అయితే దుర్గామాతకు చాలా ప్రీతికరమైనది.. దుర్గామాతకు పూజ చేసే సమయంలో ఈ ఎర్ర మందార పువ్వులను దేవతలకు సమర్పిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఎర్ర మందారపు పూల చెట్లను ఇంట్లో నాటడం చాలా శుభ్రంగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ మందార పూల మొక్కను ఇంట్లో నాటడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవడంతో పాటు ప్రతికూలతను తొలగిస్తుందట.

అదేవిధంగా ఈ మొక్కను ఇంట్లో నాటడం ద్వారా ఆ ఇంట్లో సుఖ శాంతి నెలకొంటుందట. ఆర్థిక పురోగతిని సాధించడంతోపాటు ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుందట. అదేవిధంగా సూర్యభగవానుడిని మందార పువ్వులతో పూజిస్తారు. ఈ మందార పువ్వులను నీటిలో వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇది జాతకంలో సూర్య‌ స్థానాన్ని బలపరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు..

do pooja to lord surya like this for wealth and health

ఈ మొక్కను ఇంట్లో నాటడం ద్వారా కుటుంబ కలహాలు తొలగిపోయి సంబంధాలు మరింత బలపడతాయి. ఈ మొక్కను ఇంట్లో తూర్పు దిశలో నాటడం చాలా శుభ్రంగా పరిగణించబడుతుంది. ఇక వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా సాగుతుంది. మందార పువ్వులను గుత్తులుగా పేర్చి అందంగా ఇంట్లో గదుల్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మందార పువ్వులను పూజా సమయంలో దుర్గాదేవికి లక్ష్మీదేవికి హనుమంతుడికి సమర్పించడం వల్ల మంగళ దోషాన్ని తొలగిస్తుంది. అదేవిధంగా డబ్బుకు ఆహారానికి ఎప్పుడు కూడా కొరత ఉండదు. ఈ మందార పువ్వులను దుర్గాదేవికి సమర్పించడం వల్ల దుర్గాదేవి అనుగ్రహం లభించి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది..

Admin

Recent Posts